అంతర్జాతీయం

కంప్యూటర్లను నమ్మను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామ్‌బీచ్, జనవరి 1: ప్రపంచమంతా ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్ కంప్యూటర్ల వైపు పరిగెడుతుంటే.. ఆధునిక టెక్నాలజీకి ఆద్యు రాలుగా భావిస్తున్న అమెరికా కొత్త అధ్యక్షుడు కా నున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన రూటే వేర ంటున్నారు. అసలు కంప్యూటర్లేవీ సురక్షితం కాదని పేర్కొన్న ఆయన, ఈమెయల్స్ వల్ల వ్యక్తిగత స మాచారం బట్టబయలేనని హెచ్చరించారు. కొ రి యర్ వ్యవస్థకు మించిన రక్షణ వ్యవస్థ మరొకటి లేదంటూ కొత్త ఏడాది సందర్భంగా తనదైన శైలిలో ఒక ప్రకటన జారీ చేశారు. ‘మీరు ఏదయినా సమాచారం ముఖ్యమైనదని భావిస్తే దాన్ని పాత పద్ధతిలో కాగితంపైన రాసి ఒక కొరియర్ చేతికి ఇచ్చి పంపండి. అంతే తప్ప ఇ-మెయిల్స్‌లాంటి వాటి ద్వారా పంపకండి. ఎందుకంటే ఏ కంప్యూటర్ కూ డా సురక్షితం కాదు’ అని శనివారం ఫ్లోరిడాలోని త న క్లబ్‌లో నూతన సంవత్సర సందర్భంగా ఇచ్చిన విందులో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. విందు సందర్భంగా సైబర్ సెక్యూరిటీపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశా రు. హ్యాకింగ్ ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించిందని అమెరికా ఇంటెలిజన్స్ ఏజన్సీలు చేసిన ఆరోపణలను సైతం ‘వాళ్లు ఏం చెప్పినా నేను పట్టించుకోను’ అంటూ తోసిపుచ్చారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షు డు బరాక్ ఒబామా ఈ వారం ప్రారంభంలో ర ష్యా గూఢచార ఏజన్సీలపై నిషేధం విధించడమే కాకుండా గూఢచర్యానికి పాల్పడినట్లు చెప్తున్న 35 మంది రష్యా దౌత్య అధికారులను బహిష్కరించడం తెలిసిందే. తాము చేసిన ఆరోపణలను అధికారులు ముందుగా నిర్ధారించుకోవాలని, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన ఆరోపణ అని ఈ ఆరోపణల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వచ్చే వారం ఇంటెలిజన్స్ అధికారులను కలుసుంటానని ఇంతకుముందు చెప్పిన ట్రంప్ అన్నారు. అమెరికా దాడికి ముందు ఇరాక్‌లో మారణాయుధాలు ఉండడంపై ఇంటెలిజన్స్ వర్గాలు విఫలమయిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ హ్యాకింగ్ విషయంలో తాను ఎక్స్‌పర్ట్‌నని చెప్పుకొన్నారు. హ్యా కింగ్ గురించి తనకు బోలెడంత తెలుసునని చెప్పుకున్న ట్రంప్ హ్యాకింగ్ అనేది నిరూపించడానికి చాలా కష్టమైన విషయమని, ‘మిగతా వాళ్లకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు. అందుకే వాళ్లకు పరిస్థితి గురించి కచ్చితంగా అంచనా వేయలేరు’ అని అన్నారు. తన మార్-ఎ-లాగో క్లబ్‌లో ట్రంప్ ఇచ్చిన విందుకు హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, ప్రముఖ మోడల్ ఫ్యాబియోతో పాటుగా వందల సంఖ్యలో అతిథులు హాజరయ్యారు.

చిత్రం..న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్