అంతర్జాతీయం

ఒబామా నిర్ణయాలు రద్దు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 2: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలి రోజునే డొనాల్డ్ ట్రంప్ అనేక సంచలనాలకు తెరతీసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న అనేక నిర్ణయాలను ట్రంప్ రద్దుచేసే అవకాశముందని ఆయన కీలక సలహాదారు సియాన్ స్పైసర్ వెల్లడించారు. శే్వతసౌధంలోకి అడుగుపెట్టే తొలి రోజునే ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకోనున్నారని ఒబామా చేపట్టిన చర్యల వల్ల ఆర్థిక వృద్ధి మందగించడంతోపాటు ఉపాధి కల్పన కూడా దెబ్బతినడమే ఇందుకు కారణమని వెల్లడించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఒబామా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను సమీక్షించిన అనంతరం వాటిని ట్రంప్ రద్దుచేస్తారని తెలిపారు. జనవరి 20న ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ ఎనిమిదేళ్లలో ఒబామా అనేక నిర్ణయాలు తీసుకున్నందున వాటిలో వేటిని ట్రంప్ రద్దుచేయబోతున్నారన్న దానిపై ఇప్పటికిప్పుడే ఎలాంటి స్పష్టత లేదు. ముఖ్యంగా ఇమిగ్రేషన్, ఇంధన నియంత్రణ, విదేశాంగ విధానాలకు సంబంధించి ఒబామా తీసుకున్న అనేక నిర్ణయాలకు ట్రంప్ తిలోదకాలివ్వడం ఖాయమని స్పష్టమవుతోంది.