అంతర్జాతీయం

న్యూయార్క్‌లో హాలీవుడ్ తరహా దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 3: అమెరికా మన్‌హట్టన్‌లో జనమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి ఉన్న సమయంలో ముగ్గురు దోపిడీ దొంగలు ఓ నగల దుకాణంలోకి చొరబడి అత్యంత చాకచక్యంగా 60 లక్షల డాలర్ల విలువైన వజ్రాలు, రత్నాల ఆభరణాలను దోచుకెళ్లారు. హాలీవుడ్ సినిమా తరహాలో ఆదివారంనాడు ఈ దోపిడీ జరిగింది. అదే సమయంలో దాదాపు 7 వేల మంది పోలీసులు టైమ్స్ స్క్వేర్ వద్ద జరుగుతున్న న్యూ ఇయర్స్ వేడుకల భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అదే అదనుగా భావించిన ముగ్గురు దొంగలు గుండు చేయించుకుని ముసుగులు వేసుకుని తాపీగా నగల దుకాణంలోకి చొరబడి తమ పని పూర్తి చేసేసుకున్నారు. న్యూఇయర్ వేడుకలు ప్రారంభమయ్యే వరకు దొంగలు వేచి చూసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. కాగా, ఈ దోపిడీ నగల దుకాణం లోపలివారి పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 60 లక్షల డాలర్ల విలువైన వజ్రాలను దోచుకు వెళ్లిన వారు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. గ్రెగ్ రూత్ అనే ఈ నగల దుకాణంలోపల ఉన్న సిసి టీవీ కెమెరాల్లో కూడా ఈ దొంగలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.
12 అంతస్తుల భవనంలోని ఆరో అంతస్తులో ఉన్న నగల దుకాణం వద్దకు సరకుల ద్వారం గుండా ప్రవేశించిన దొంగలు సుత్తి, క్రోబార్ సాయంతో దుకాణం తాళాలు పగులగొట్టి నాలుగు సేఫ్‌లున్న గదిలోకి ప్రవేశించారు. గ్లోవ్స్ ధరించి ఉన్న దొంగలు రెండు సేఫ్‌లలో ఉండే 18 క్యారెట్ బంగారం బ్రాస్‌లెట్లు, ఇయర్ రింగ్స్, నెక్‌లెస్‌లను బ్యాక్‌ప్యాకెట్లలోకి కూరుకున్నారు. రెండు సేఫ్‌లు అంతకుముందే తెరిచి ఉండడమో లేదా వాటి కాంబినేషన్ వారికి తెలిసి ఉండడమో జరిగి ఉండవచ్చని కూడా పోలీసులు తెలిపారు. సేఫ్‌ను తెరిచే సమయంలో ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న దృశ్యాలను సైతం సిసిటీవీలో రికార్డు అయ్యాయి. తాళాలు వేసి ఉన్న మిగతా రెండు సేఫ్‌లలో మరో 70 లక్షల డాలర్ల విలువైన ఆభరణాలున్నాయి. కాగా, దోపిడీ జరిగిన సమయంలో దుకాణం యజమాని భారత్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.