అంతర్జాతీయం

ఇజ్రాయెల్ సైనికులపై పాలస్తీనియన్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, జనవరి 8: జరూసలేంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికులపై ఓ పాలస్తీనియన్ దాడికి తెగబడ్డాడు. ఓ ట్రక్‌తో దూసుకొచ్చిన దుండగుడు అక్కడున్న ఇజ్రాయెల్ సైనికులపైకి వేగంగా నడిపించటంతో నలుగురు సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. పదిహేను మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యం ఆ దుండగుడిని అక్కడికక్కడే చంపేసింది. సదరు టెర్రరిస్టు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు ప్రకటించారు. సైనికులు ఘటనా స్థలంలో ఒక బస్సు దిగి మరో బస్సు ఎక్కేందుకు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా ఉగ్రవాది ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.