అంతర్జాతీయం

‘ఉగ్ర’ముఠాలను కట్టడి చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లాంటి వాటిపైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని ఫ్రాన్స్ గురువారం గట్టిగా కోరింది. అంతేకాకుండా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చూసేందుకు భారత్‌తో కలిసి కృషిచేస్తామని కూడా హామీ ఇచ్చింది. మసూద్ అజర్‌పై ఆంక్షలకు భద్రతా మండలిలో చేసిన ఒక ప్రతిపాదనకు చైనా మోకాలొడ్డిన విషయం తెలిసిందే. కాగా ముప్పుతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ కృతనిశ్చయం ప్రతిచోటా ఒకే విధంగా ఉండాలని చైనా పేరును నేరుగా ప్రస్తావించకుండా ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-మార్క్ ఆరాల్ట్ అన్నారు. ఉరీ ఆర్మీ క్యాంప్‌పై దాడి తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో మన దేశం అధీన రేఖకు ఆవలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరపడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇలాంటి ముప్పులు ఎదురైనప్పుడు తనను తాను రక్షించుకునేందుకు ప్రతి దేశానికీ హక్కు ఉంటుందని అన్నారు. ఇటీవలి ఉరీ దాడిసహా భారత్‌కు వ్యతిరేకంగా జరిగే దాడులను ఫ్రాన్స్ చాలా తీవ్రంగా ఖండించిందని, ఉగ్రవాదంపై జరిపే పోరులో భారత్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించిందని మన దేశంలో నాలుగు రోజుల పర్యటనకోసం వచ్చిన జీన్-మార్క్ పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
తమ భూభాగాలపైనుంచి లేదా తమ అధీనంలోని భూభాగాలనుంచి కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రవాదం పట్ల అన్ని దేశాలు కూడా సమర్థవంతంగా పోరాటం జరపాలని ఆయన అన్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి పాక్ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ దేశాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది సుస్పష్టం. ఉగ్రవాదం ఏ విధంగాను సమర్థనీయం కాదని, అన్ని చోట్లా ఒకే విధంగా పోరాడాలని, ఒక దేశానికి ఈ తరహా ఉగ్రవాద ముప్పు ఎదురైనప్పుడు తనను తాను కాపాడుకునే హక్కు ఆ దేశానికి ఉంటుందని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన లక్షిత దాడుల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పారు.
కాగా, మసూద్ అజర్‌పై ఆంక్షలను చైనా అడ్డుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ తమ రెండు దేశాలు కలిసికట్టుగా కృషి చేసినప్పటికీ, కమిటీనుంచి పెద్దఎత్తున మద్దతు వ్యక్తమైనప్పటికీ ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని చెప్పారు. జైషే మహమ్మద్‌ను ఇప్పటికే కమిటీ ఉగ్రవాద ముఠాల జాబితాలో చేర్చడం జరిగిందని, అందువల్ల ఆ సంస్థ చీఫ్‌ను కూడా జాబితాలో చేర్చాలనే దానికి మద్దతుగా బలమైన వాదన ఉందని ఆయన చెప్పారు.

చిత్రం..ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-మార్క్ ఆరాల్ట్