అంతర్జాతీయం

ఉపాధి కల్పనలో మందగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జనవరి 13: భారత్‌లో నిరుద్యోగ సమస్య మరింత జఠిలం కానుందని ఐరాస నివేదిక వెల్లడించింది. కొత్తగా ఉద్యోగాల సృష్టి లేకపోవడం, స్తబ్ధత ఏర్పడం వల్ల 2017-18 మధ్య నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లేబర్ రిపోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఉపాధి, సామాజిక మార్పులకు సంబధించి 2017 నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. సామాజంలో అసమానతలు పెరిగిపోతాయని జోస్యం చెప్పారు. భారత్‌లో ఉపాధి కల్పన ఆశాజనంగా లేదని, 2017-18 మధ్య నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని ఐరాస నివేదికలో తెలిపారు. 2017లో నిరుద్యోగిత శాతం 17.8 శాతం పెరిగే సంకేతాలున్నాయి. గత ఏడాది శాతం 17.7 గా ఉంది. అలాగే వచ్చే ఏడాది నాటికి 18 మిలియన్లకు చేరుకుంటుందని చెప్పారు. కాగా 2016లో దేశంలో ఉపాధికల్పన సంతృప్తికరంగానే ఉందని వివరించారు. అంటే 13.4 మిలియన్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందని ఐరాస వెల్లడించింది. 2016లో వృద్ధి రేటు 7.6 శాతంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.