అంతర్జాతీయం

రెచ్చగొట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 16: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం చైనాకు మంట పుట్టిస్తోంది. తైవాన్ విషయంలోట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై డ్రాగన్ నిప్పులు చెరగుతోంది. ‘ఒకేచైనా’ విధానాన్ని సవాలు చేసే రీతిలో అమెరికా వ్యవహరిస్తే మాత్రం తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని ట్రంప్‌ను హెచ్చరించింది. ఒకేచైనా అంశంపై తమ ఆలోచనలు మారబోతున్నాయంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్‌వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. తైవాన్‌కు సంబంధించి ఎప్పుడూ కూడా అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న దాఖలాలు ఇప్పటివరకూ లేవు. అయితే అమెరికా అధ్యక్షుడిగా తన ఎన్నికను అభినందిస్తూ తైవాన్ అధ్యక్షుడు వెన్ చేసిన ఫోన్‌కు డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందించడం చైనాకు మింగుడుపడడం లేదు. తైవాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడటం ద్వారా దౌత్యపరమైన నిబంధనకు ట్రంప్ తిలోదకాలిచ్చాడని చైనా భావిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, చైనాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీసే చర్యలు చేపట్టవద్దంటూ బీజింగ్ ఇప్పటికే హెచ్చరించింది. అయితే తాజా పరిణామం నేపథ్యంలో ఒకేచైనా విధానం విషయంలో రాజీపడేది లేదని, ట్రంప్ తన ఆలోచన మార్చుకోకుంటే దేనికైనా సిద్ధమంటూ సవాలు సంకేతాలను చైనా అందించింది.