అంతర్జాతీయం

ట్రెండ్ మారుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 17: ఇప్పటి వరకూ మనం వైట్ కాలర్ ఉద్యోగాల గురించే విన్నాం! ప్రపంచ పారిశ్రామిక ఉద్దండులు ‘న్యూకాలర్ జాబ్స్’ను తెరపైకి తెచ్చారు. రానున్న రోజుల్లో ఆటోమేషన్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే (మానవ ప్రమేయం లేకుండా పనిచేసే కంప్యూటర్ వ్యవస్థలు) రాజ్యమని మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. అలాంటి సరికొత్త ఆవిష్కరణలకు తగ్గట్టుగా మానవాళి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దావోస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సదస్సులో సత్య నాదెళ్ల మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ‘న్యూకాలర్’ ఉద్యోగాలకు ఐటి రంగం సమాయత్తం కావాలన్నారు. ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ వేగాన్ని అందిపుచ్చుకోవాలని, ఇందుకు వీలుగా ఐటి రంగం సన్నద్ధం కావాలన్నారు. ముఖ్యంగా ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) వేగంగా వేళూనుతున్న దృష్ట్యా ఉత్పన్నమయ్యే ‘న్యూ కాలర్ జాబ్స్’పై దృష్టి పెట్టాలని మైక్రోసాఫ్ట్, ఐబిఎమ్ వంటి సంస్థలే స్పష్టం చేశాయి. ఈ పరిణామం వల్ల ఉన్న ఉద్యోగాలు కొన్ని తగ్గిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఐటి సిబ్బందిని ఈ రకమైన న్యూకాలర్ జాబ్స్‌కు సంసిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని సత్య సూచించారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ సరైన దిశగానే పురోగమిస్తోందని పేర్కొన్న మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య, మందకొడిగా సాగుతున్న ప్రపంచ జిడిపిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఐఎ వంటి కొత్త ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కృత్రిమ ఇంటెలిజెన్స్ వల్ల మానవ సామర్థ్యం మరింత మెరుగయ్యేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచం ఎవరి పర్యవేక్షణ లేకుండానే ముందుకు సాగిపోయే పరిస్థితులు ఏర్పతాయని, ఆవిధంగా టెక్నాలజీ వేళ్లూనుకుంటుందని తెలిపారు. అంతకుముందు బెర్లిన్‌లో మాట్లాడిన నాదెళ్ల కొత్త ఉద్యోగాల సృజన విషయంలో అమెరికా కంపెనీలు సరైన కృషి చేయడం లేదంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగించడం లేదన్నారు. తమది అమెరికా కేంద్రకంగా పనిచేసే కంపెనీ అని, అక్కడే తమ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉందని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా తమకు 113000 మంది ఉద్యోగులు ఉన్నారని, అమెరికాలోనే వీరి సంఖ్య 64 వేలకు పైనేనని వివరించారు.
కాగా డావోస్ సదస్సులో మాట్లాడిన ఐబిఎమ్ సిఇఓ గిన్నీ రోమెట్టి కూడా రానున్న కాలంలో న్యూ కాలర్ జాబ్స్‌దే రాజ్యమన్నారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నా.. మెజార్టీ సిబ్బంది ఉన్న సిస్టమ్స్‌లోనే పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉన్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను సంతరింపజేయడం ద్వారా న్యూ కాలర్ జాబ్స్‌ను సృష్టించాలని, భారత్‌వంటి దేశాలకు చెందిన యువత ఈ కొత్త డేటా ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలకం కాగలరన్న నమ్మకం తనకుందని అన్నారు.