తెలంగాణ

ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే అధిక శాతంలో ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో తొలిసారిగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 53.32 శాతం మంది, సెకండియర్‌లో 62.01 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు.
ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా- 2,43,503 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 59 శాతం మంది, బాలురు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సరంలో 4,18,231 మంది పరీక్షలు రాయగా- 2,62,245 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 67.64 శాతం మంది, బాలురు 58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.