అంతర్జాతీయం

టాప్ టెన్ నగరాల్లో హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్ , జనవరి 17: ప్రపంచ అభివృద్ధి పటంపై భాగ్యనగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకొంది. అన్ని విధాలుగా సమకూరిన వనరులతో నవోత్తేజంగా పరుగులు పెడుతున్న ప్రపంచ పట్టణాల్లో హైదరాబాద్‌కు ఐదవ స్థానం లభించింది. 2030 కల్లా ఈ మహానగరం మెగాసిటీగా మారేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని తాజాగా జెఎల్‌ఎల్ అనే అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ రూపొందించిన నివేదికలో స్పష్టం అవుతోంది. నగరాల అభివృద్ధి సూచి పేరిట ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల ప్రగతి సూచి గురించి ఈ సంస్థ సర్వే జరిపింది. టాప్ టెన్ జాబితాలో బెంగళూరుకు తొలి స్థానం లభించగా, హైదరాబాద్‌కు ఐదవ స్థానం దక్కింది. మెగా సిటీగా పేరొందిన పూణే, చెన్నై, ఢిల్లీ నగరాలకు 30 లోపు స్థానాలు సంపాదించుకున్నాయి. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సదస్సులో ఐక్య రాజ్య సమితి ప్రపంచ పట్టణాల నివేదికను కూడా పరిశీలించారు. ప్రస్తుతం భారత్‌లో ఐదు మెగాసిటీలు ఉన్నాయని, 2030నాటి కల్లా వీటి సంఖ్య ఏడుకు పెరుగుతుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. రానున్న 14 సంవత్సరాల కాలంలో రూపుదిద్దుకోనున్న రెండు మెగాసిటీల్లో ఒకటి హైదరాబాద్ కాగా, రెండవది ఆహ్మదాబాద్. టాప్ 10లో ఉన్న నగరాలు అన్ని కూడా అనేక రకాలుగా తమ ప్రత్యేకతలను చాటుకుంటున్నాయని, బలమైన నెట్‌వర్క్‌తో జాతీయ స్థాయి ఆర్థిక సగటును అధిగమిస్తున్నాయని జెఎల్‌ఎల్ గ్లోబెల్ రిసెర్చ్ డైరెక్టర్ జెరెలీ కెల్లీ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఆచరణ యోగ్యం చేసుకోవడం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వేగంగా వసతులు కల్పించడం, అన్నిటి కంటే మించి ప్రపంచ దేశాలు, నగరాలతో సంధానం కావడమే ప్రామాణికంగా ఈ నగరాల జాబితాను రూపొందించినట్టు ఆయన తెలిపారు. నగర స్థూల జాతీయోత్పత్తి, కార్పొరేట్ ప్రధాన కార్యాలయాల సంఖ్య రియల్ ఎస్టేట్ నిర్మాణాలు, అద్దెలు, విద్య, ఉద్యోగ అవకాశాలు, వినూత్న ఆవిష్కరణలు, పర్యావరణ సమతూల్యత సహా మొత్తం 42 అంశాలను ఈ అధ్యయనంలో భాగంగా తాము పరిశీలించినట్టు చెప్పారు. ఎన్నో రకాలుగా రాజకీయ పరమైన అలజడులు చెలరేగినా, ఆర్థిక పరమైన ఆస్థిరత చోటు చేసుకున్నా ఈ నగరాలన్నీ అసాధారణమైన డైనమిజాన్ని ప్రదర్శించాయని జరెనీ కెల్లీ స్పష్టం చేశారు. ఈ పట్టణాలు అనూహ్య రీతిలో అభివృద్ధి చెందడానికి వినూత్న ఆవిష్కరణతో దూసుకు పోవడానికి ప్రధాన కారణం కొత్త టెక్నాలజీని ఆస్వాధించే లక్షణాన్ని కలిగి ఉండడమేనని, అదే విధంగా అంతర్జాతీయ మార్పులను ఔపోసన పట్టడమేనని తెలిపారు. ప్రధానంగా టెక్నాలజీ వినూత్న ఆవిష్కరణలే నగరాల ప్రగతి శీలతకు సంకేతాలు అవుతాయని వీటిని ఎంతగా ఆస్వాదించగలిగితే, ఎంతగా వీటికి పెద్ద పీట వేయగలిగితే అంతగా ఆయా నగరాలు దేదీప్యమవుతాయని తెలిపారు.
టాప్ 10 నగరాలు
1 బెంగళూరు(్భరత్)
2. హోచిమిన్‌సిటీ(వియత్నాం)
3. సిలికాన్ వ్యాలీ(అమెరికా)
4.షాంగై(చైనా)
5. హైదరాబాద్(్భరత్)
6. లండన్ ( యూకె)
7. ఆస్టిన్ (అమెరికా)
8 హనోయ్ ( వియత్నాం)
9. డోస్టన్ (అమెరికా)
10. నైరోబి( కెన్యా)