అంతర్జాతీయం

నేటి నుంచి ట్రంప్ యుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 19: మరికొద్ది గంటల్లో అమెరికాలో కొత్త శకం ప్రారంభం కానుంది. అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ 45వ అధ్యక్షుడిగా శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచీ వాషింగ్టన్‌లో ప్రమాణ స్వీకారం జరిగే వరకూ, ఆ తరువాతా ట్రంప్ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయమే ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలసి కాఫీ తీసుకున్న తరువాత ఇద్దరూ కలిసి సెంట్ జాన్స్ చర్చికి వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే వైట్‌హౌస్ గేట్లు ప్రజలకు తెరుచుకుంటాయి. ఆరు గేట్ల నుంచి ప్రవేశ పాస్‌లు ఉన్న వాళ్లను అనుమతిస్తారు. ఒక్కో గేట్‌కి ఒక్కో రంగు ఉన్న పాస్‌లను ఇచ్చారు. ఉదయం 9.30గంటలకు ప్రముఖ గాయని జాకీ ఇవాంచో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఆ తరువాత మార్మన్ టే బెర్నాకిల్ బృందం సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అనంతరం మతప్రబోధకులు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు డొనాల్డ్ ట్రంప్‌తో అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. ఆ వెంటనే ట్రంప్ అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగాన్ని చేస్తారు. ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణం చేస్తారు. ఆ తరువాత కాపిటల్ భవనంలోని స్టాచువరీ హాలులో మొదటి అధికారిక విందు జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పెన్సిల్వేనియా ఎవెన్యూ మార్గం నుంచి వైట్ హౌస్‌కి అధ్యక్ష కవాతు వెళ్తుంది. ఈ కవాతును దాదాపు పదివేల మంది పోలీసులు, జాతీయ భద్రతాబలగాలు పర్యవేక్షిస్తాయి. ఈ కార్యక్రమానికి బరాక్ ఒబామాతో పాటు, డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యు బుష్, జిమ్మి కార్టర్‌లు హాజరవుతారు. ప్రమాణ స్వీకారం తరువాత జనవరి 21మధ్యాహ్నం ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళలు భారీ ఎత్తున నిరసనలు తెలిపేందుకు సన్నద్ధమవుతున్నారు.
అమెరికాకు పునర్వైభవం
ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చర్చించిన ‘అమెరికాకు పునర్వైభవం’ అన్న అజెండాను మొదటి రోజునుంచే ట్రంప్ అమల్లోకి తీసుకువస్తారని అంటున్నారు. ఒబామా తీసుకున్న నిర్ణయాలు కొన్నింటిని తొలి రోజే రద్దు చేసే అవకాశాలున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, దేశంలోకి ముస్లింల ప్రవేశంపై ఆంక్షలు, ట్రాన్స్-పసిఫిక్ కూటమి నుంచి అమెరికా వైదొలగడం వంటి నిర్ణయాలను ట్రంప్ మొదటిరోజే తీసుకోవచ్చని భావిస్తున్నారు.