అంతర్జాతీయం

థాంక్స్.. మోదీజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 19: ‘మోదీజీ మీ సహకారానికి కృతజ్ఞతలు. మీ స్నేహంతో భారత అమెరికాల మధ్య అనుబంధం గతంలో కంటే మరింత బలపడింది. రక్షణ, పౌర అణు ఇంధన రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం పాదుకొల్పటంలో మనం విజయం సాధించాం’’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. మరి కొద్ది గంటల్లో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఒబామా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. ఉభయదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి ఒబామా ఇచ్చిన మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2015 గణతంత్ర వేడుకలకు తాను ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భాన్ని ఒబామా గుర్తు చేసుకున్నారు. ఈ నెల 26న జరగనున్న 68వ గణతంత్ర దినోత్సవానికి ఒబామా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఒబామా హయాంలో ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అమెరికాకు భారత్ ప్రధాన రక్షణ భాగస్వామిగా మారిందని మోదీ అన్నట్లు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. ఒబామా భవిష్యత్ కార్యక్రమాలు విజయవంతం కావాలని మోదీ ఆకాక్ష వ్యక్తం చేశారు. 2014లో మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత ఇద్దరు నేతలు మొత్తం 8సార్లు కలుసుకున్నారు. భారత ప్రధాని ఒక అమెరికా అధ్యక్షుడిని ఇన్ని సార్లు కలవటం రికార్డే.