అంతర్జాతీయం

ఇరాన్ ప్లాస్కో బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహరాన్, జనవరి 19: ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని అత్యంత పురాతన భవనాల్లో ఒకటైన పదిహేను అంతస్తుల ప్లాస్కో బిల్డింగ్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయినట్లు అధికారులు ద్రువీకరించనప్పటికీ భవనం కుప్పకూలిపోయిన సమయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల ఉన్నట్లు టెహరాన్ మేయర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ చెప్పారు. భవన శిథిలాలనుంచి ముగ్గురిని ప్రాణాలతో కాపాడి ఆస్పత్రికి తరలించారు. 1960నాటి ఈ భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి దాదాపు 200మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు. భవనంలో మంటలు చెలరేగిన వెంటనే భవనంలోని వారిని కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినప్పుడు కనీసం 70 మంది గాయపడ్డారని, వారిలో 23 మందిని ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.

చిత్రాలు...ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని ప్లాస్కో బిల్డింగ్‌లో ఎగసిపడుతున్న మంటలు. అనంతరం కుప్పకూలిన భవనం