అంతర్జాతీయం

అది బోగస్ మెడికల్ రిపోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 22: న్యాయమూర్తుల అక్రమ నిర్బంధం కేసులో నిందితుడైన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వెజ్ ముషారఫ్‌కు స్థానిక కోర్టులు చుక్కెదురైంది. కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మెడికల్ రిపోర్టు బోగస్‌గా ఉగ్రవాద నిరోధక కోర్టు తేల్చింది. 2007లో జడ్జిలను నిర్బంధించినట్టు ముషారఫ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ముషారఫ్ విదేశీ పర్యటనలపై సుప్రీం కోర్టు నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో వైద్య పరీక్షల కోసమనిచెప్పి దుబాయ్ వెళ్లారు. జడ్జిల నిర్బంధం కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుఇవ్వాలంటూ ఏప్రిల్ 6న దరఖాస్తుతోపాటు మెడికల్ రిపోర్టు కోర్టుకు అందజేశారు. తన క్లయింట్‌కు వ్యక్తిగత హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపుఇవ్వాలన్న ముషారఫ్ తరఫున్యాయవాది అక్తర్‌షా చేసిన అభ్యర్థను రావల్పిండి కోర్టు తోసిపుచ్చింది. గతంలో మాజీ సైనికాధ్యక్షుడిపై ఇచ్చిన నాన్‌బెయిలబుల్ నోటీసు చెల్లుబాటు అవుతుందని ఎటిసి న్యాయమూర్తి సొహైల్ ప్రకటించారు. పోలీసు భద్రత అలాగే వైద్యులతో పరీక్షలు చేయించుకోవచ్చని కోర్టు ముషారఫ్‌కు అనుమతి ఇచ్చిన విషయాన్ని లాయర్ జడ్జి దృష్టికి తెచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తి కేసు విచారం మొదలై ఏడాదిన్నర కావస్తున్నా ముషారఫ్ ఒక్కసారీ హాజరుకాలేదని స్పష్టం చేశారు. తాజాగా దాఖలు చేసిన మెడికల్ రిపోర్టును కోర్టు తోసిపుచ్చి, ముషారఫ్ ఎక్కడున్నది సమాచారం సేకరించాలని ఆదేశించింది. అలాగే మే 20న వాయిదాకు కచ్చితంగా రావల్సిందేనని న్యాయమూర్తి చెప్పారు. 2007లో ఎమర్జన్సీ విధించినప్పుడు ఉన్నత న్యాయస్థానాలకు చెందిన 60 మంది జడ్జిలను గృహనిర్బంధం చేశారు. దీనిపై 2009 ఆగస్టులో ముషారఫ్‌పై కేసు నమోదైంది. 2013లో కేసు విచారణ ప్రారంభంకాగా వ్యక్తిగత హాజరు నుంచి ముషారఫ్ 42 సార్లు మినహాయింపుపొందారు.