అంతర్జాతీయం

ఆగని ఆగ్రహ జ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 22: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేంగా దేశవ్యాప్తంగా భారీఎత్తున నిరసన జ్వాలలు రగులుతున్నాయి. గత శుక్రవారం ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. అదే రోజు వాషింగ్టన్‌తో పాటుగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు (శనివారం) దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షలకు పైగా మహిళలు రోడ్లపైకి వచ్చి తమ అధ్యక్షుడిగా ట్రంప్ వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. ఏ సంఘాలు, సంస్థల మద్దతు లేకుండానే మహిళలు స్వచ్ఛందంగా ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారని అధికారులు చెప్తున్నారు. కాగా, ప్రతికూల పరిస్థితుల్లో సైతం మానవ హక్కుల పరిరక్షణకోసం తాము జరపబోయే పోరాటానికి ఇది ప్రారంభం మాత్రమేనని ఆందోళన విజయవంతంగా ముగిసిన అనంతరం మహిళా ప్రదర్శన నిర్వాహకులు ప్రకటించారు. అమెరికా కొత్త అధ్యక్షుడి విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా తాము ఈ ఆందోళనలో పాలు పంచుకొన్నట్లు ఆందోళనలో పాల్గొన్న వారు చెప్పారు. వాషింగ్టన్ డిసిలో దాదాపు 5లక్షల మంది మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పగా, లాస్ ఏంజెల్స్‌లో దీనికన్నా ఎక్కువ మందే పాలుపంచుకున్నారు. వాషింగ్టన్‌లోని పెన్సిల్వేనియా అవెన్యూ జనంతో నిండిపోయింది. సాయంత్రం ఈ జనమంతా వైట్‌హౌస్‌కు ప్రదర్శనగా బయలుదేరారు. ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో పాప్‌స్టార్ మడోన్నా పాల్గొనడం విశేషం. వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ వద్ద ప్రదర్శనలో అనుకోని అతిథిలాగా ప్రత్యక్షమైన మడోన్నాను చూసి నిర్వాహకులు సైతం నివ్వెరపోయారు. ప్రదర్శనలో మాట్లాడిన వారంతా కూడా వలసలు, ముస్లింలు, మహిళల పట్ల ట్రంప్ అభిప్రాయాలను దుయ్యబట్టారు. పింక్ రంగు పిల్లిచెవుల టోపీలు పెట్టుకున్న మహిళలతో మెట్రోరైళ్లన్నీ కిటకిటలాడాయి. చికాగో, బోస్టన్ తదితర నగరాల్లో సైతం భారీ నిరసన ర్యాలీలు జరిగాయి.
జర్నలిస్టులపై ట్రంప్ అక్కసు
డొనాల్డ్‌ట్రంప్ మరోసారి మీడియాపైన, జర్నలిస్టులపైన తన అక్కసును వెళ్లగక్కారు. ఈ భూమీద అత్యంత నిజాయితీ లేని మనుషులు జర్నిలిస్టులేనని మండిపడ్డారు. కొంతకాలంగా తాను మీడియాతో యుద్ధం చేస్తున్నానని, వారిని హెచ్చరిస్తూ వస్తున్నానని, ఫలితంగా తన ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ మంది ప్రసారం చేశారని అన్నారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని కూడా ఆయన హెచ్చరించారు. తాను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముందు చాలా పెద్ద జనసమూహం ఉందని ఆయన చెప్తూ, సభాస్థలి అంతా జనంతో నిండిపోయినప్పటికీ ఒక మీడియా నెట్‌వర్క్‌ను చూసినప్పుడు జనం లేక ఖాళీగా ఉన్నచోట్లను చూపించారని ట్రంప్ వాపోయారు.

చిత్రం..ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన అనంతరం తిరిగివెళ్లేందుకు భారీస్థాయలో వాషింగ్టన్‌లో మెట్రో రైల్వే స్టేషన్‌కు చేరుకున్న మహిళలు