అంతర్జాతీయం

మీడియా సంబంధాలపై పునరాలోచన చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 23: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతను అస్థిరపరచేందుకు మీడియా ప్రయత్నిస్తే దానితో సంబంధాలను పునరాలోచిస్తామని ట్రంప్ సన్నిహిత సహచరుడు, వైట్‌హౌస్ సిబ్బంది వ్యవహారాల చీఫ్ రియన్స్ ప్రీబస్ స్పష్టం చేశారు. ట్రంప్ పరిపాలనకు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా తగిన చర్య ఉంటుందని ఆయన అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రజల సంఖ్య గురించి మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. తప్పుడు వార్తా ప్రసారాల పట్ల ప్రతిరోజూ గట్టిగా పోరాటం జరుగుతుందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడి కౌన్సిలర్ కెల్లీ లానే కానే్వ ఏబిసి న్యూస్‌తో మాట్లాడుతూ ‘సంబంధాలు కొనసాగించే పద్ధతి ఇది కాదు. ఈయన అమెరికాకు అధ్యక్షుడు. ఒకసారి అధ్యక్షుడిగా తొలి ప్రసంగాన్ని మళ్లీ వినండి. అది అందరినీ ఉద్దేశించింది. సమైక్యతకోసం ఆయన పిలుపునిచ్చారు. అమెరికన్ల ఆకాంక్షలను సాధించే దిశగా సాగిన ప్రసంగం అది. మన ప్రజలకు తిరిగి అధికారాన్ని ఇప్పించుకునే దిశలో దూరదృష్టితో చేసిన ప్రసంగం’ అని ఆయన అన్నారు.