అంతర్జాతీయం

బీభత్సం సృష్టిస్తున్న టోర్నడోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ అడెల్, జనవరి 23: అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆగ్నేయ అమెరికాలో టోర్నడోల వల్ల భారీగా విధ్వంసం జరిగింది. కనీసం 18మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. చాలాచోట్ల ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పెద్ద పెద్ద వృక్షాలు సైతం కుప్పకూలిపోయాయి. ఉత్తర ఫ్లోరిడా, కరోలినా రాష్ట్రాలు టోర్నడోలకు అల్లల్లాడిపోయాయి. ఒక్క జార్జియాలోనే 14మంది చనిపోయినట్లు సమాచారం మిసిసిపి నుంచి జార్జియా దాకా సమాచార వ్యవస్థ నాశనమైంది. మిసిసిపిలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. జార్జియాలోని అతిపెద్ద నగరం అల్బేనీలో 76వేల మంది విద్యుత్ సరఫరా లేక, సమాచార వ్యవస్థ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇళ్లు కూలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
జార్జియా అత్యవసర నిర్వహణ కమిటీ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. అయితే విద్యుత్ లైన్లను పునరుద్ధరించేందుకు ఇంకా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఈదురుగాలులు పెనువేగంగా వీచాయని, దీనివల్ల ఎక్కువ విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు.

చిత్రం..టోర్నడోల తీవ్రతకు అడెల్‌లో ధ్వంసమైన ఇళ్లు