అంతర్జాతీయం

లా లా ల్యాండ్‌కు 14 ఆస్కార్ నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, జనవరి 24: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డులకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. ‘లా లా ల్యాండ్’ చిత్రం రికార్డు స్థాయిలో 14నామినేషన్లను సంతరించుకుంది. 89వ అకాడమీ అవార్డులకు సంబంధించి నామినేట్ అయిన చిత్రాల సంఖ్యను మంగళవారం ప్రకటించారు. 14నామినేషన్లు ఒక సినిమాకు దక్కడం అన్నది ఇది మూడోసారి. గతంలో 1959లో ‘ ఆల్ అబౌట్ ఈవ్’ అనే చిత్రానికి 14 నామినేషన్లు దక్కాయి. అలాగే 1997లో విడుదలైన ‘టైటానిక్’ చిత్రం కూడా 14నామినేషన్లు దక్కించుకుంది. ఇక అత్యధిక స్థాయిలో 8నామినేషన్‌లు దక్కించుకుని సైంటిఫిక్ ఫిక్షన్ ‘అరైవల్’, ‘మూన్‌లైట్’ చిత్రాలు రెండోస్థానంలో నిలిచాయి. బ్రిటిష్ భారతీయ నటుడు దేవ్ పటేల్ ది లయన్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా తొలి నామినేషన్ దక్కించుకున్నారు. భారత దేశ నేపథ్యంలో ఈ చిత్రం నిర్మితమైంది.