అంతర్జాతీయం

సింధ్‌అసెంబ్లీ సభ్యురాలికి లైంగిక వేధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, జనవరి 25: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ మంత్రి మహిళా సభ్యురాలిపట్ల అవమానకరంగా వ్యవహరించడమే కాకుండా ఆమెను తన ప్రైవేట్ చాంబర్‌కు రమ్మని పిలిచారు. దీంతో మంత్రిపై చర్య తీసుకోకపోతే తాను అసెంబ్లీలోనే ఆత్మాహుతి చేసుకుంటానని ఆమె బెదిరించింది. చివరికి మంత్రి ఆమెకు క్షమాపణ చెప్పడంతో సమస్యకు తాత్కాలికంగా తెరపడినప్పటికీ, ఈ ఉదంతం పాక్‌లో మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక ప్రజా ప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఇప్పుడంతా ప్రశ్నిస్తున్నారు. గత వారం సింధ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియా, టీవీ చానళ్లలోను విస్తృతంగా ప్రచారం కావడంతో పెద్ద సంచలనమైంది. ప్రతిపక్ష ముస్లింలీగ్ ఫంక్షనల్ పార్టీకి చెందిన నుస్రత్ సహర్ అబ్బాసీ అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ కొన్ని విషయాలపై వివరణ అడిగారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ఇమ్దాద్ పటాఫి సభలో అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కావాలంటే తన ప్రైవేట్ చాంబర్‌కు రమ్మంటూ అనడమే కాకుండా ఆమెపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ప్రవర్తనతో అధికార పాకిస్తానీ పీపుల్స్ పార్టీ (పిపిపి) సైతం ఇరకాటంలో పడింది. పిపిపి చైర్‌పర్సన్ బిల్వాల్ భుట్టో జర్దారీ, ఆయన సోదరి భక్తవార్ జర్దారీ జోక్యం చేసుకుని నుస్రత్‌కు క్షమాపణ చెప్పాల్సిందిగా మంత్రిని ఆదేశించారు. సోమవారం అబ్బాసీ పెట్రోల్ బాటిల్‌తో సభకు వచ్చి మంత్రిని బర్తరఫ్ చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించారు. ఈ దశలో సదరు మంత్రి ఆమెకు మర్యాద సూచకంగా ‘చాదర్’కప్పి సభలో అందరూ చూస్తుండగా క్షమాపణ చెప్పారు. దీంతో గొడవ సద్దు మణిగింది.