అంతర్జాతీయం

అధ్వాన్నంగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 27: అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి (శుక్రవారం) సరిగా వారం రోజులు అ యింది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత క్విన్నిపియాక్ యూనివర్శిటీ ఒక పోల్ సర్వేను నిర్వహించింది. గత శుక్రవారం ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన వివాదాస్పద ప్రసంగం మొదలుకొని బుధవారం దాకా తొలి అయిదు రోజుల్లో ట్రంప్ పాలన ఎలా ఉంది? సంతకాలు చేసిన పైళ్లలోని అంశాలు, వాటిని ఏ మేరకు అమలు చేస్తారు? తదితర ప్రశ్నలతో నిర్వహించిన సర్వే ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అధ్యక్షుడిగా ట్రంప్ తొలి అయిదు రోజుల పని తీరుకు అమెరికా ఓటర్లలో 36 శాతం మంది మాత్రమే మద్దతు తెలపగా, 44 శాతం మంది వ్యతిరేకించారు. ఇప్పుడున్న వలస విధానాల్లో మార్పులు చేయడంతో పాటుగా వలసలు నిరోధించడం కోసం మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మించాలన్న కొత్త ప్రభుత్వ వివాదాస్పద ఆలోచనల నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. ఫైళ్లపై సంతకాలయితే చేశారు కానీ అవి ఏ మేరకు అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉందని అత్యధిక శాతం మంది అభిప్రాయ పడ్డం గమనార్హం. 19 శాతం మంది ఎటూ నిర్ణయించుకోలేదని తెలప డం గమనార్హం. గత వారం గ్యాలప్ నిర్వహించిన ఇలాంటి పోల్‌లో సైతం వైట్‌హౌస్‌లో ట్రంప్ తొలి రోజుల పని తీరు పట్ల అమెరికా చరిత్రలో ఇంతకు ముందు ఏ అధ్యక్షుడికీ రానంత తక్కువ శాతం మద్దతు రావడం తెలిసిందే. గ్యాలప్ నిర్వహించిన పోల్‌లో సైతం ట్రంప్ పని తీరును వ్యతిరేకిస్తున్నట్లు 45 శాతం మంది చెప్పడం గమనార్హం.
కాగా, ఈ సర్వేలో పాల్గొన్న డెమోక్రటిక్ పార్టీ ఓటర్లలో కేవలం 4 శాతం ట్రంప్‌కు మద్దతు తెలపగా అత్యధిక శాతం అంటే 77 శాతం మంది పెదవి విరిచారు. రిపబ్లికన్ ఓటర్లలో మాత్రం 81 శాతం మంది ఆయనకు అండగా నిలిచారు. మగవాళ్లలో ట్రంప్‌కు మద్దతు తెలిపిన వారి సంఖ్య వ్యతిరేకించే వారికన్నా కాస్త ఎక్కువే ఉండగా మహిళల్లో సగం మంది వ్యతిరేకించగా, కెవలం మూడింట ఒక వంతుమంది మాత్రమే ఆయన పని తీరును సమర్థించారు. కాగా, ట్రంప్‌కు ముందు అధ్యక్షుడిగా ఉండిన బరాక్ ఒబామాతో పోలిస్తే అధ్యక్షుడిగా ట్రంప్ నాలుగేళ్ల పాలన అధ్వాన్నంగా ఉండవచ్చని 50 శాతం మంది భావించగా, మెరుగ్గా ఉంటుందని 37 శాతం మంది మాత్రమే అభిప్రాయ పడ్డారు. 1190 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు.
మెక్సికో దిగుమతులపై
20 శాతం పన్ను?
ఇదిలా ఉండగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధుల కోసం మెక్సికోతో పాటుగా అమెరికాతో వాణిజ్య లోటు ఉన్న దేశాలనుంచి దిగుమతి అయ్యే సరకులపై 20 శాతం పన్ను విధిస్తామని అమెరికా హెచ్చరించింది. దీని ప్రభావం భారత్, చైనాలాంటి దేశాలపై కూడా ఉండవచ్చని, అయితే ప్రస్తుతానికి ఇది మెక్సికోకే పరిమితమని ట్రంప్ తో పాటుగా ఎయిర్‌ఫోర్స్ ఒన్ విమానంలో పిలడెల్ఫియానుంచి వాషింగ్టన్‌కు ప్రయాణించిన మీడి యా ప్రతినిధులకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ చెప్పారు.