అంతర్జాతీయం

అమెరికా మిలటరీకి మరింతగా జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 28: అమెరికా సాయుధ దళాలను మరింతగా బలోపేతం చేయడానికి దారి తీసే ఓ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల తర్వాత తొలిసారిగా శుక్రవారం రక్షణ కార్యాలయం పెంటగాన్‌కు వచ్చిన ట్రంప్ అమెరికాలోకి ముస్లింల అక్రమ ప్రవేశాలను నిరోధించే ఉత్తర్వుతోపాటుగా అమెరికా సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే ఉత్తర్వుపైన కూడా సంతకం చేశారు. అమెరికా సాయుధ దళాలకోసం కొత్త విమానాలు, కొత్త నౌకలు, కొత్త వనరులు, కొత్త పరికరాలను సమకూర్చుకునేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నామని, ఆ పని చేస్తున్నందుకు తాను ఎంతో గర్విస్తున్నానని ఈ ఉత్తర్వుపైన సంతకం చేసిన తర్వాత ట్రంప్ అన్నారు. తమ బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినప్పుడు దాన్ని చూసి అమెరికా కాంగ్రెస్ ఎంతో సంతోషిస్తుందని తాను అనుకుంటున్నానని కూడా ఆయన చెప్పారు. మన సైనిక శక్తిని ఎవరూ ప్రశ్నించలేరని, అలాగే శాంతిపట్ల మన అంకిత భావాన్ని కూడా ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. ఈ పర్యటన సందర్భంగా రక్షణ మంత్రిగా జేమ్స్ మాటిస్ చేత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా రక్షణ బలగాల పునర్నిర్మాణానికి చర్యలను తక్షణమే ప్రారంభించాలని ట్రంప్ పెంటగాన్‌ను ఆదేశించడం సరయిన చర్య అని అమెరికా కాంగ్రెస్‌లో సాయుధ బలగాల కమిటీ చైర్మన్ మాక్ థోర్న్‌బెర్రీ వ్యాఖ్యానించారు.