అంతర్జాతీయం

వెల్లువెత్తుతున్న నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 28: అమెరికాలోకి వస్తున్న శరణార్థులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శరణార్థుల పునరావాస కార్యక్రమాన్ని 120 రోజుల పాటు నిలిపివేసే ఎగ్జిక్యూటివ్ ఆదేశంపై ట్రంప్ సంతకం చేయడంపై 12 మంది నోబెల్ బహుమతి గ్రహీతలతో పాటుగా వేలాది మంది విద్యావేత్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఒక తీర్మానంపై శుక్రవారం సాయంత్రానికల్లా 11 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, వేలాది మంది విద్యావేత్తలు సంతకాలు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. నిమిషానికి పది ఇ-మెయిల్స్ చొప్పున తమకు వస్తున్నాయని, కొత్తగా సంతకాలు చేర్చడానికి 15-20 మంది వలంటీర్లు పని చేస్తున్నారని వారు తెలిపారు.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా శరణార్థుల రాకను పరిమితం చేస్తూ ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఫ్రాన్స్, జర్మనీ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-మార్క్ ఆరాల్ట్ అన్నారు. యుద్ధానికి నయపడి పారిపోయి వస్తున్న శరణార్థులను స్వాగతించడం మన విధిలో భాగం’ అని జర్మనీ కొత్త విదేశాంగ మంత్రి సిగ్మర్ గాబ్రియాల్‌లో పారిస్‌లో సమావేశం అనంతరం ఆయన చెప్పారు. తాజా నిర్ణయం తమకు ఆందోళన కలిగిస్తోందని ఆయన అంటూ, అయితే తమకు ఆందోళన కలిగించే అంశాలు చాలానే ఉన్నాయని చెప్పారు. కాగా, ఐరోపా యూనియన్ ప్రతినిధి ట్రంప్ నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యా చేయడానికి ఇష్టపడలేదు. అయితే యుద్ధాలు, ఉగ్రవాదానికి వెరచి పారిపోయి వచ్చే వారికి ఐరోపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఇయు కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ గతంలో అనేక సార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గోడలు కట్టే సమయం కాదు..
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించాలన్న ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ కూడా ఇదేవిధంగా స్పందించారు. దేశాల మధ్య అడ్డు గోడలు కట్టేందుకు ఇది సమయం కాదని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే బెర్లిన్ గోడను కూల్చివేసిన విషయాన్ని ట్రంప్ మర్చిపోయారని, ఇంకా ఎక్కడైనా దేశాల మధ్య అడ్డు గోడలు ఉంటే వాటిని కూడా కూల్చివేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా, ట్రంప్ ఆదేశాలను దక్షిణాసియాలోని ప్రముఖ న్యాయవాద సంఘాలు తీవ్రంగా గర్హించాయి.

చిత్రం..శరణార్థులపై ఆంక్షలు విధిస్తూ సంతకం చేసిన ఫైల్‌ను చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్