అంతర్జాతీయం

విశ్వ సుందరి.. ఇరిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌కు చెందిన అందాల భామ ఇరిస్ మిట్టెనరీ సరికొత్త విశ్వ సుందరిగా ఆవిర్భవించింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 65వ ఎడిషన్ అందాల పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన మొత్తం 86 మందిలో ఇరిస్ విజేతగా నిలిచి ‘మిస్ యూనివర్స్-2017’ కిరీటాన్ని కైవసం చేసుకోగా, హైతీ భామ రకెల్ పెలిస్సియర్ మొదటి రన్నరప్ టైటిల్‌ను, కొలంబియాకు చెందిన ఆండ్రియా టోవర్ రెండవ రన్నరప్ టైటిల్‌ను గెలుచున్నారు. ఇరిస్‌కు గత ఎడిషన్ పోటీల విజేత పియా ఉర్ట్‌బాచ్ (్ఫలిప్పీన్స్) ఈ కిరీటాన్ని అలంకరించింది. పర్షియాలో పుట్టిపెరిగిన 24 ఏళ్ల ఇరిస్ ప్రస్తుతం దంత వైద్య శాస్త్రంలో డిగ్రీని అభ్యసిస్తోంది. అయితే మన దేశం నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న రోష్మితా హరిమూర్తి టాప్-13 పోటీదారుల జాబితాలో చోటు సంపాదించడంలో విఫలమవడం అభిమానులను నిరాశపర్చింది. 1994లో విశ్వ సుందరిగా ఆవిర్భవించిన భారత అందాల భామ సుస్మితా సేన్ ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారిలో ఒకరుగా ఉన్నారు.