అంతర్జాతీయం

శరణార్థులకు స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 30: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం దేశాల వలసలను నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చినప్పటికీ తాము మాత్రం శరణార్థులకు ఉద్యోగాలిచ్చి తీరుతామని స్టార్‌బక్స్ సంస్థ ప్రకటించింది. వచ్చే అయిదేళ్లలో పదివేల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొంది. కాఫీ రిటైలర్స్ చైర్మన్, సీఈఓ హోవర్డ్ షుల్జ్ మాట్లాడుతూ అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిలో నియమిస్తామని స్పష్టం చేశారు. సిరియా, ఇరాక్‌లలో అమెరికా సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచిన శరణార్థులకు అండగా నిలుస్తామన్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంలో హోవర్డ్ హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా నిలిచారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెల్త్‌కేర్ చట్టాన్ని రద్దు చేయటం, మెక్సికోతో వ్యాపార లావాదేవీలను పునర్వ్యవస్థీకరించటం, ఇప్పుడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోకి రానివ్వకుండా నిషేధించటంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మెక్సికోలో కాఫీ తోటల పెంపకందారులను స్టార్‌బక్స్ సహాయం చేస్తుందని హోవర్డ్ స్పష్టం చేశారు. అర్హులైన కార్మికులకు ఆరోగ్యబీమా కల్పిస్తామని ఆయన ప్రకటించారు. తమ కంపెనీ ఉద్యోగులకు ఆయన ఇమెయిల్ ద్వారా స్పష్టమైన హామీ ఇచ్చారు. ‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపట్ల మీరంతా ఆందోళనగా ఉన్నారని తెలుసు. మానవ హక్కులపై జరుగుతున్న ఈ దాడిని మనం గట్టిగా ఎదుర్కొంటాం’ అని పేర్కొన్నారు.

చిత్రం..స్టార్‌బక్స్ సీఈఓ హోవర్డ్ షుల్జ్