అంతర్జాతీయం

అమెరికా విలువలకే ప్రమాదం: ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 31: కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర పదజాలంతో తప్పుబట్టారు. ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారిపై నిషేధం విధించడం విస్తృత తనిఖీలకు ఆదేశాలు జారీచేయడం అన్నది అమెరికా పెంచి పోషిస్తున్న విలువలకు విఘాతం కలిగించడమే అవుతుందని హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు ఒబామా మద్దతు తెలిపారు. కుల, మత విశ్వాసాల ప్రాతిపదికగా వ్యక్తులపై వివక్ష చూపడం అన్నది ఎంతమాత్రం సరైనది కాదని, దీనితో తాను పూర్తిస్థాయిలో విభేదిస్తున్నానని తెలిపారు. అమెరికా అధ్యక్ష పదవినుంచి తప్పుకున్న తర్వాత ఒబామా ఒక బహిరంగ ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.