అంతర్జాతీయం

నిషేధాన్ని ఎత్తివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 31: ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులను అమెరికాలోకి అనుమతించకూడదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వరుసగా మూడోరోజు కూడా నిరసనలు వెల్లువెత్తాయి. శరణార్థులు, ముస్లిం దేశాలకు చెందిన వారిపై విధించిన ఆంక్షలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు సుప్రీం కోర్టు ముందు శాంతియుతంగా ధర్నా జరిపారు. ట్రంప్ నిర్ణయం వల్ల రాజ్యాంగ వ్యతిరేకంగా మతపరమైన పరీక్ష జరుగుతోందని, అలాగే దేశంలో తమ భద్రతకు దీనివల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళనకారులు స్పష్టం చేశారు. అలాగే అమెరికా విలువలకు కూడా నిర్ణయం తీవ్ర విఘాతానే్న కలిగిస్తోందని కాంగ్రెస్ సభ్యుడు స్టెనీ హోయర్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ అమెరికా గురించిన ఉన్నతమైన అభిప్రాయం కాస్తా ఈ నిర్ణయంతో మట్టికొట్టుకుపోయిందని, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలకు దీనివల్ల మరింత ఊతం లభించే ప్రమాదం ఉందని తెలిపారు. అమెరికా తమ జన్మభూమి అని, ప్రతి ఒక్కరి భవిష్యత్తు దీనితో ముడిపడి వుందని, ఎన్నో విలువలతో కూడిన ఈ దేశ స్వరూపాన్ని దెబ్బతీయకూడదని ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు నాన్సీ ఫెలోసీ అన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశ భద్రతా ప్రయోజనాలను పెంపొందించేది ఎంతమాత్రం కాదని, ఇది అర్ధరహితంగా, నిర్లక్ష్యధోరణితో తీసుకున్న నిర్ణయమన్నారు. ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ 30 మంది డెమొక్రటిక్ పార్టీ సభ్యులు ట్రంప్‌కు లేఖ రాశారు.

చిత్రం..వాషింగ్టన్ డిసిలో ధర్నా చేస్తున్న డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు