అంతర్జాతీయం

గ్రీన్ కార్డుంటే రావచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత మేర ఆంక్షలను సడలించారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు గ్రీన్‌కార్డు ఉన్నట్టయితే ఎలాంటి ప్రత్యేక అనుమతి లేకుండా అమెరికాకు రావచ్చునని స్పష్టం చేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రతినిధి సీన్ స్పైసర్ ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రీన్‌కార్డు కలిగిన ఉన్న ఈ దేశాల పౌరుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, వారు స్వేచ్ఛగా తమ ప్రయాణాలను కొనసాగించవచ్చునని వివరించారు. అయితే మిగతావారిపై మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ట్రంప్ నిషేధాజ్ఞలపై సర్వత్రా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్ ఈ మేరకు సడలింపు ప్రకటన చేసింది. నిషేధం అమలులోకి వచ్చిన క్షణం నుంచి ముస్లిం దేశాలకు చెందిన న్యాయబద్ధమైన గ్రీన్‌కార్డుదారులనూ అమెరికాలోకి రాకుండా విమానాశ్రయాల్లోనే నిలిపివేశారు.అమెరికా యుద్ధ సమయంలో సహకరించి ప్రత్యేక వీసాలు పొందిన ఇరాకీలను సైతం రానివ్వలేదు. తాజా సడలింపు నేపథ్యంలో వెయ్యి మంది గ్రీన్‌కార్డుదారుల్ని దేశంలోకి అనుమతించారు.