అంతర్జాతీయం

ట్రంపా..మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/కాన్‌బెర్రా, ఫిబ్రవరి 2: ముస్లిం వలసదారులపై ఆంక్షలు, హెచ్1బి వీసాలపై కొరడా ఝుళిపించి ప్రపంచాన్ని గడగడలాడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా దేశాలపైనే పడ్డారు. ఇప్పుడు తన మిత్రదేశమైన ఆస్ట్రేలియాపైనా నిన్నమొనే్న పౌర అణు ఇంధన ఒప్పందం కుదుర్చుకున్న ఇరాన్‌పైనా ఏకకాలంలో విరుచుకుపడ్డారు. కుప్పకూలుతున్న మీ దేశాన్ని మేమే రక్షించాం.. మమ్మల్నే ధిక్కరిస్తారా అంటూ ఇరాన్‌పై కనె్నర్ర చేశారు. అమెరికా కుదర్చుకున్న అణు ఒప్పందం వల్లే ఇరాన్ బతికి బట్టగలిగిందన్న ట్రంప్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఈ క్షిపణి పరీక్షలను విడనాడకపోతే మళ్లీ ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరించారు. దశాబ్దాలు తరబడి సంఘర్షణలతో సాగిన ఇరాన్, అమెరికా సంబంధాలు శాంతియుత పథంలో పడ్డాయని భావిస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. 2015 అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా 150 బిలియన్ డాలర్ల ఇరాన్ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని మొదటి నుంచీ ట్రంప్ తీవ్రంగా ప్రతిఘటిస్తునే వస్తున్నారు. ఇప్పుడు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షలతో మళ్లీ ఇరుదేశాలు మధ్య సంఘర్షణలకు తెరలేచింది. మరోపక్క ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో డొనాల్డ్ ట్రంప్ జరిపిన టెలిఫోన్ సంభాషణ కూడా దౌత్యపరమైన విపత్తుగా మారింది. ఒబామా హయాంలో ఆస్ట్రేలియాతో కుదిరిన శరణార్థుల ఒప్పందాన్ని ట్రంప్ తిరస్కరించారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. దాంతో కేవలం 25 నిముషాల్లోనే వీరిద్దరి ఫోన్ సంభాషణ ముగిసింది. ఆస్ట్రేలియా శరణార్థులను అమెరికా ఎందుకు అంగీకరించాలంటూ గతంలో కుదిరిన ఒప్పందాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఏ విధంగా చూసినా ఈ శరణార్థుల ఒప్పందం అమెరికాకు నష్టదాయకమేనని 2000 మంది శరణార్థులను అంగీకరిస్తే వీరి నుంచి మరో బోస్టన్ బాంబర్ పుట్టుకొస్తాడని కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయనను ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా ఆస్ట్రేలియా ప్రధానికి సాధ్యం కాలేదు. అంతేకాకుండా ఉన్నట్టుండి ట్రంప్ ఫోన్ పెట్టేయడంతో ఆస్ట్రేలియా ప్రధాని విస్తుపోయారు.

చిత్రం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్