అంతర్జాతీయం

చైనా బ్రహ్మాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 2: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న చైనా తన సైనిక పాటవాన్ని చాటుకోవడానికి, ఆ దేశంతో తఅవసరమైతే లపడడానికి సైతం సిద్ధమవుతోంది. ‘వాషింగ్టన్ బేకన్’ పత్రిక కథనం ప్రకారం గత నెల చైనా 10 అణ్వస్త్రాలను ఏకకాలంలో మోసుకుపోగల క్షిపణిని పరీక్షించింది. గత నెల డెంగ్‌ఫెంగ్-5సి క్షిపణి ప్రయోగం జరిగింది. స్వతంత్రంగా లక్ష్యాలను ఛేదించగల 10 వార్‌హెడ్లను ఈ ప్రయోగంలో ఉపయోగించారు. ఈ వార్‌హెడ్లను మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్స్ (ఎంఐఆర్‌వి)గా పిలుస్తారు.
ఈ ప్రయోగాన్ని అమెరికా నిఘా సంస్థలు నిశితంగా పరిశీలించినట్లు ఆ పత్రిక తెలిపింది. షాంగ్జి ప్రావియన్స్‌లోని తైయువాన్ స్పేస్ లాంచ్ సెంటర్‌నుంచి పది డమీ వార్‌హెడ్లను మోసుకెళ్తున్న డిఎఫ్-5సి క్షిపణిని ప్రయోగించినట్లు, అది పశ్చిమ చైనాలోని ఎడారి వైపు వెళ్లినట్లు కూడా తెలిపింది. డిఎఫ్-5 రకం క్షిపణుల్లో ఇది కొత్తది. ఈ ఖండాంతర ఉపరితల క్షిపణి 1980 దశకం ప్రారంభంలోనే సేవలు ప్రారంభించింది. ‘మా రక్షణ వ్యూహాల్లో భాగంగా రక్షణ విభాగం రొటీన్‌గా చైనా మిలటరీలో జరిగే పరిణామాలను, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఏ) సామర్థ్యాలకు సంబంధించిన కథనాలను రొటీన్‌గా గమనిస్తూ ఉంటుంది’ అని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి కమాండర్ గారీ రాస్ చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. చైనా వద్ద 250 దాకా అణ్వాయుధాలు ఉండవచ్చని అమెరికా అంచనా వేస్తోంది. అయితే ఇప్పుడు ఒకేసారి పది వార్‌హెడ్స్‌తో పరీక్ష నిర్వహించడాన్ని బట్టి దానివద్ద అంతకన్నా ఎక్కువ అణ్వాయుధాలే ఉండవచ్చని అంటున్నారు.