అంతర్జాతీయం

మనం జాబ్‌లు మార్చుకుందామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఒక రియాల్టీ షోలో తన స్థానంలో ప్రముఖ హాలీవుడ్ కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను తీసుకున్న తర్వాత దాని టీవీ రేటింగ్‌లు పడిపోవడాన్ని ఎద్దేవా చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ష్వార్జ్‌నెగ్గర్ తనదైన శైలిలో చురకలు అంటించారు. మనమిద్దరమూ మన ఉద్యోగాలు మార్చుకుందామని సలహా ఇచ్చిన ఆయన అప్పుడైనా అమెరికన్లు మళ్లీ సుఖంగా నిద్రపోతారంటూ వ్యాఖ్యానించారు.‘ది న్యూ సెలబ్రిటీ అప్రెంటీస్’గా పిలవబడే ఈ రియాల్టీ షోలో హోస్ట్‌గా ఉండిన ట్రంప్ స్థానంలో కొత్తగా ష్వార్జ్‌నెగ్గర్‌ను తీసుకున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ తన స్థానంలో రియాల్టీ షో నిర్వాహకులు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ అనే ఓ బడా సినీ స్టార్‌ను తీసుకున్నారని, అప్పటినుంచి దాని రేటింగ్స్ ఎలా పడిపోతున్నాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. గురువారం క్రైస్తవ మతపెద్దలు, అమెరికా కాంగ్రెస్‌కు చెందిన నేతలు పాల్గొన్న ఓ ప్రార్థనా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.