అంతర్జాతీయం

ట్రంప్‌పై పోరుకోసం ట్విట్టర్ ఉద్యోగుల విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 3: వివాదాస్పద నిర్ణయాలతో విమర్శలకు గురవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోరుకు టెక్ దిగ్గజాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ ఉద్యోగులు సైతం ఇందుకు నడుం బిగించారు. అమెరికాకు చెందిన ప్రముఖ హక్కుల సంస్థ ఎసిఎల్‌యు చేపట్టిన ఆన్‌లైన్ ఉద్యమానికి మద్దతుగా ట్విట్టర్ సిఈఓ జాక్ డోర్సీ, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమిడ్ కోర్డిస్టానీ సహా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు గత వారం రోజుల్లో దాదాపు 1.59 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. పౌర స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడినప్పుడు స్వేచ్ఛను కాపాడుకోవడానికి, ప్రజల రక్షణకోసం మనమంతా ఒక్కటిగా నిలవాల్సిన అవసరముందని ట్విట్టర్ జనరల్ కాన్సల్ విజయ్ గద్దే అన్నారు. తమ పని ఇంతటితో ముగియలేదని, రానున్న రోజుల్లో న్యాయపోరాటాలను ఉద్ధృతం చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.