అంతర్జాతీయం

అమెరికా ఆంక్షలకు నిరసనగా క్షిపణులను ప్రదర్శించిన ఇరాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహరాన్, ఫిబ్రవరి 4: గత వారాంతంలో జరిపిన బాలిస్టిక్ క్షిపణి పరీక్షపై మండిపడిన అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో ఇరాన్ సైతం దానికి ప్రతిగా తన క్షిపణులను ప్రదర్శించింది. అమెరికా ఆంక్షలు విధించిన రెండు రోజులకే ఇరాన్ ఈ క్షిపణులను ప్రదర్శించడం గమనార్హం. ఉత్తర ఇరాన్ రాష్టమ్రైన సెమ్నాన్‌లో రివల్యూషనరీ గార్డ్స్ జరిపిన సైనిక విన్యాసాల్లో ఈ క్షిపణులను ప్రదర్శించారు. కాగా ఎలాంటి బెదిరింపులనైనా ఎదుర్కోవడానికి పూర్తిసన్నద్ధతతో ఉన్నామని చెప్పడానికి, అలాగే అమెరికా విధించిన అవమానకరమైన ఆంక్షలకు నిరసన తెలియజేసే ఉద్దేశంతోనే ఈ సైనిక విన్యాసాలు జరిపినట్లు రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ‘సెఫాన్యూస్’ వెబ్‌సైట్ తెలిపింది. దేశీయంగా తయారు చేసిన పలు రకాలయిన రాడార్, క్షిపణి వ్యవస్థలు, కమాండ్, కంట్రోల్ సెంటర్లు, సైబర్ యుద్ధ వ్యవస్థలను ఈ విన్యాసాల్లో ప్రదర్శించినట్లు ఆ వెబ్‌సైట్ తెలిపింది. అయితే ఈ విన్యాసాల్లో 75 కిలోమీటర్ల రేంజి సామర్థ్యం కలిగిన క్షిపణులను మాత్రమే ప్రదర్శించినట్లు ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఉంచిన క్షిపణుల జాబితాను బట్టి అర్థమవుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం ఇరాన్‌లోనే ఉందని ఆంక్షలు విధించిన కొద్ది గంటల్లోనే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ చీఫ్ జేమ్స్ మ్యాటిన్ చెప్పడం గమనార్హం. అయితే దీనికి ప్రతిగా తాము సైతం పశ్చిమాసియా ప్రాంతంలో ఉగ్రవాద ముఠాలను సమర్థించే కొంతమంది అమెరికన్లు, అమెరికా కంపెనీలపైన న్యాయపరమైన ఆంక్షలు విధిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.