అంతర్జాతీయం

ఐరాస జెఐయు సభ్యుడిగా గోపినాథన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఫిబ్రవరి 4: భారత ఉన్నత స్థాయి దౌత్యవేత్త అచంకులంగారే గోపినాథన్ ఐక్యరాజ్య సమితి (ఐరాస) జాయింట్ ఇన్‌స్పెక్షన్ యూనిట్ (జెఐయు) సభ్యుడిగా తిరిగి నియమితులయ్యారు. ఐరాస జనరల్ అసెంబ్లీ అతనిని నియమించింది. గోపినాథన్‌తో పాటు సుకాయి ప్రోమ్ జాక్సన్ (గాంబియా), జీన్ వెస్లీ కాజియు (హైతీ), నికోలాయ్ లోజిన్‌స్కియ్ (రష్యా) జాయింట్ ఇన్‌స్పెక్షన్ యూనిట్ సభ్యులుగా నియమితులయ్యారు. 2018 జనవరి ఒకటి నుంచి అయిదేళ్ల పాటు వారు ఈ పదవిలో కొనసాగుతారు.
గోపినాథన్ తొలిసారి ఈ యూనిట్ సభ్యుడిగా 2013 జనవరిలో నియమితులయ్యారు. 2017 డిసెంబర్ వరకు అతని పదవీకాలం ఉంటుంది. ఆ ఎన్నికల్లో ఆయన 183 ఓట్లకు గాను 106 ఓట్లు సాధించి చైనా రాయబారి ఝాంగ్ యాన్‌ను ఓడించారు. గోపినాథన్ జాయింట్ ఇన్‌స్పెక్షన్ యూనిట్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.