అంతర్జాతీయం

అమెరికా విమానం ఎక్కడానికి ఆత్రుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, ఫిబ్రవరి 5: అమెరికాలోకి ప్రవేశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను దేశవ్యాప్తంగా, తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్ ఫెడరల్ జడ్జి జేమ్స్ రోబర్ట్ జారీ చేసిన ఆదేశాలు ఆ దేశానికి వెళ్లాలని చూస్తున్న ముస్లిం దేశాల ప్రజలకు ఊరట కలిగించాయి.
ఎప్పుడేమి అవుతుందో తెలియని ఈ అనిశ్చిత పరిస్థితుల్లో తాత్కాలికంగానైనా దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తూ ఆంక్షలకు గురైన అమెరికా వీసాలు కలిగి ఉన్న ప్రజలు ఇప్పుడు అమెరికా విమానాలు ఎక్కడానికి తొందరపడుతున్నారు.
న్యాయమూర్తి జేమ్స్ రోబర్ట్ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో వారం రోజుల నుంచి అమలులో ఉన్న ఆంక్షలను ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం ఎత్తివేసింది. ఈ తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమెరికాకు రావాలనుకునే వారు రావాలని తాము సూచిస్తున్నామని మిచిగాన్‌లోని డేర్‌బార్న్ కేంద్రంగా పనిచేస్తున్న అరబ్ అమెరికన్ సివిల్ రైట్స్ లీగ్ డైరెక్టర్ రూలా ఔన్ చెప్పారు.