అంతర్జాతీయం

బయటపడిన పాక్ నిజస్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: పాకిస్తాన్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. స్వంత దేశ ప్రజలే ఈ విషయాన్ని ఎండగట్టారు. అమాయక ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ సాగిస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ, అధికారుల ద్వారా అమాయక ప్రజలపై అత్యాచారాలకు పాల్పడుతోందని పిఒకె నుంచి ఈ ప్రదర్శనకు తరలివచ్చిన ప్రజలు ఆరోపించారు.