అంతర్జాతీయం

తల్లి ఒడికి చేరిన పాకిస్తాన్ బాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్ / న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఐదేళ్ల పాకిస్తానీ బాలుడిని తల్లి దగ్గరకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు భారతీయ అధికారులు. వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్‌కు చెందిన బాలుడు ఇఫ్తికార్‌ను అతని తండ్రి ఎత్తుకుని దుబాయ్‌కి పారిపోయాడు. ఆ తర్వాత భారత్‌లోని జమ్ముకాశ్మీర్‌కు చేరుకున్నాడు. బాలుడి తల్లి రోహిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పాక్ అధికారులు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు వివరాలు అందించారు. ఆయన ప్రమేయంతో స్పందించిన భారతీయ అధికారులు ఇఫ్తికార్ ఆచూకీ కనుకొని వాఘా సరిహద్దు వద్ద శనివారం అతని తల్లికి అప్పగించారు. దీంతో ఆ తల్లి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ అభ్యర్థనను మన్నించి బాలుడిని తల్లి దగ్గరికి చేర్చిన భారత అధికారులకు అబ్దుల్ బాసిత్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ తతంగం అంతా పూర్తికావడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది.