అంతర్జాతీయం

వెనక్కి తగ్గేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 7: ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారి ప్రవేశంపై విధించిన నిషేధం విషయంలో రాజీ పడేది లేదని వైట్‌హౌస్ తేల్చిచెప్పిన నేపథ్యంలో ఈ న్యాయ పోరాటంలో అమీ తుమీ తేల్చుకోవడానికి అటు రాష్ట్రాలకు చెందిన అటార్నీలు, ఇటు ఫెడరల్ లాయర్లు సిద్ధమవుతున్నారు. ఈ నిషేధానికి సంబంధించి వస్తున్న కేసుల విషయంలో తాము విజయం సాధించగలమని ధీమాను వైట్‌హౌస్ వ్యక్తం చేసింది. మరోపక్క దేశవ్యాప్తంగా 16మంది అమెరికా అటార్నీ జనరళ్లు ట్రంప్ నిర్ణయంపై మూకుమ్మడిగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశాధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమే కాకుండా అమెరికా పెంచి పోషిస్తూ వస్తున్న విలువలకూ విరుద్ధమని, అన్నిరకాలా వివక్షా పూరితమని ఈ అటార్నీ జనరళ్లు తెలిపారు. అయితే సీటెల్ లోని ఓ కోర్టు దీనిపై స్టే విధించిన నేపథ్యంలో దీన్ని సవాలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తొమ్మిదో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టులో దీన్ని సవాలు చేసింది. ఇక్కడే పదహారు రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరళ్లు ఉమ్మడిగానే ట్రంప్ నిర్ణయంపై మరో సవాలు పిటిషన్ వేశారు. బుధవారం ఈ వ్యవహారం విచారణకు రానుంది. అమెరికా ప్రజల రక్షణ, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం చట్టాన్ని పరిరక్షించటమే ఈ అప్పీళ్ల ధ్యేయమని పెన్సిల్వేనియాకు చెందిన అటార్నీజనరల్ జోషి షాపిరో స్పష్టం చేశారు. దేశ చట్టాల కంటే, రాజ్యాంగం కంటే ఏ అధ్యక్షుడు లేదా ప్రభుత్వం శక్తిమంతం కాదని వెల్లడించారు. తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవటం, పౌరులను రక్షించటం అటార్నీ జనరళ్లుగా తమ బాధ్యత అని చెప్పారు. ఇదిలా ఉండగా, ముస్లిం దేశాలపై విధించిన నిషేధం విషయంలో ఎలాంటి న్యాయపోరాటానికైనా తాము సిద్ధమని, దేశ చట్టం, రాజ్యాంగం అధ్యక్షుడి నిర్ణయానికి అనుకూలంగానే ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ ఎన్ని పిటిషన్లు దాఖలైనా అంతిమంగా తమ వాదన నెగ్గుతుందని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి సీన్ స్పైసర్ స్పష్టం చేశారు. ఇప్పుడు అప్పీళ్ల కోర్టులో ఇటు ప్రభుత్వం, అటు అటార్నీలు తమ తమ వాదనలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.