అంతర్జాతీయం

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 10: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజునుంచి వివాదాస్పద నిర్ణయాలతో పరిపాలన సాగిస్తున్న డొనాల్డ్‌ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను 9వ సర్క్యూట్ అపీళ్ల కోర్టు ముక్తకంఠంతో తిరస్కరించింది. దీంతో ఈ ఏడు దేశాలకు చెందిన ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించడానికి అవకాశం లభించింది. జాతీయ భద్రత దృష్ట్యా కోర్టు తక్షణమే తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం చేసిన వాదనను అపీళ్ల కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. ఉత్తర్వులో పేర్కొన్న ఏ దేశంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా అమెరికాపై ఉగ్రదాడికి కుట్ర పన్నారనే విషయాన్ని నిరూపించడంలో ప్రభుత్వం విఫలమైందని బెంచ్ పేర్కొంటూ, దేశ చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లలేమని స్పష్టం చేసింది. ట్రంప్ నిషేధాజ్ఞలను నిలిపివేస్తూ సియాటిల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ట్రంప్ ప్రభుత్వం అపీళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సియాటిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయలేమని బెంచ్‌లోని ముగ్గురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా
ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు.
కాగా, అపీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మన దేశ భద్రతకు ముప్పు ఉంది.. కోర్టులో కలుసుకుంటాం’ అని ఆయన ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తీర్పు అనంతరం విలేఖరులతో ముచ్చటించిన ట్రంప్ ఇది రాజకీయ నిర్ణయమని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. మరోవైపు కోర్టు తీర్పుపై ట్రంప్ వ్యతిరేకులు, పౌర హక్కుల ఉద్యమ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ వేడుకలు జరుపుకొన్నారు.