అంతర్జాతీయం

రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల నిరోధంపై ఎంతమాత్రం రాజీ పడేలా లేరు. ఏడు ముస్లిం దేశాల ప్రజల వలసలపై తానిచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానాలు తిరస్కరించినప్పటికీ సరి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలిస్తానని ట్రంప్ శనివారం స్పష్టం చేశారు. ‘ఈ పోరాటంలో మేమే గెలుస్తాం. అయితే ఇందులో కొంత ఆలస్యం కావచ్చు. కానీ విజయం మాదే. మాకు చాలా అవకాశాలు ఉన్నాయి. సరికొత్త ఉత్తర్వులు కూడా ఇవ్వవచ్చు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి శుక్రవారం తనతో కలసి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం (అమెరికా అధ్యక్షుడి విమానం)లో ఫ్లోరిడాకు బయలుదేరిన విలేఖరులకు ట్రంప్ తాను ఏం చేయబోతున్నదీ స్పష్‌టం చేశారు. వలసలను నిరోధించేందుకు కొత్త ఉత్తర్వులను జారీ చేయాలని భావిస్తున్నారా? అని విలేఖరులు ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘‘కచ్చితంగా. దేశ భద్రతా కారణాల రీత్యా ఇది ఎంతో ముఖ్యమని, కనుక చాలా వేగంగా చర్యలు చేపడతామ’ని చెప్పారు. ఈ విషయంలో తొమ్మిదో అమెరికా సర్క్యూట్ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ వచ్చే వారం వరకు వేచి చూస్తానని, ఆ తర్వాత సోమ, మంగళవారాల్లో వలసలను నిరోధించేందుకు కొత్త ఆదేశాన్ని జారీ చేయాలని యోచిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ‘దేశ భద్రత కోసం చేపట్టాల్సిన మరికొన్ని కొత్త చర్యలు ఉంటాయి. నేను చేపట్టింది దూకుడు చర్యే. ఇందులో సందేహం లేదు. మన రక్షణను మరింత బలోపేతం చేయటమే దీని ఉద్దేశం. మన దేశానికి వచ్చేవారెవరైనా సరే సహేతుకమైన ఉద్దేశంతో రావాలి’ అని ట్రంప్ తేల్చి చెప్పారు. ‘వచ్చే వారంలో కొత్త నిర్ణయం రాబోతోంది. అదేమిటో మీరే చూస్తారు’ అని ట్రంప్ బాంబ్ పేల్చారు. తాను నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ న్యాయప్రక్రియలో కూడా ముందుకు పోతామని అంతిమంగా తనదే విజయమని ట్రంప్ పేర్కొన్నారు. ‘మన దేశాన్ని సురక్షితంగా ఉంచటం మన కర్తవ్యం. ఇందుకోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. ఇందులో భాగంగా మనం తీసుకున్న నిర్ణయం విజయవంతమయ్యేదే. ఇది ఆలస్యం కావటానికి వీల్లేదు. ఎందుకంటే దేశ భద్రతే మన ముఖ్య లక్ష్యం కాబట్టి.’ అని ట్రంప్ వివరించారు. దేశ రక్షణ విషయంలో దృఢమైన చర్యలు తీసుకుంటారనే తనను ప్రజలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే తాను చాలా నేర్చుకున్నానని ఆయన అన్నారు. దేశానికి అనేక వైపుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో దేశానికి ముప్పు వాటిల్లనిచ్చేది లేదన్నారు. మన ప్రజలకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలోకి రానిచ్చేది లేదని ట్రంప్ వివరించారు.