అంతర్జాతీయం

నిప్పుతో చెలగాటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 15: భారత్ ‘తైవాన్ కార్డు’తో ఆడుకోవాలను కుంటోందని చైనా అధికార మీడియా బుధవారం ఆరోపించింది. ఈ సున్నితాంశంతో ఆడుకోవాలనుకుంటే మీరే నష్టపోతారని భారత్‌ను హెచ్చరించింది. చైనా.. తైవాన్‌ను తన అంతర్భాగంగా భావిస్తోంది. అయితే ఇటీవల తైవాన్‌కు చెందిన మహిళా పార్లమెంటు సభ్యుల బృందం భారత్‌లో పర్యటించడంతో చైనా ఈ హెచ్చరిక చేసింది. ‘తైవాన్ అంశంపై చైనాను సవాలు చేయడం ద్వారా భారత్ నిప్పుతో చెలగాటం ఆడుతోంది’ అని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఓపెన్ ఎడిట్ పేజీలో ప్రచురించిన ఒక వ్యాసంలో పేర్కొంది. ‘తైవాన్ కార్డుతో ఆడుకుంటే నష్టపోయేది భారతే’ అనే శీర్షికతో ఈ వ్యాసం ప్రచురితమయింది. ‘అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ అంశంపై చైనాను సవాలు చేయడం మానేసి, ‘వన్ చైనా’ విధానాన్ని అంగీకరించి, గౌరవించిన సమయంలో భారత్ చైనాను రెచ్చగొడుతోంది’ అని ఈ టాబ్లాయిడ్ పేర్కొంది. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) ప్రచురణల్లో ఈ పత్రిక ఒకటి.
‘్భరత్, తైవాన్‌ల మధ్య ఉన్నత స్థాయి బృందాల రాకపోకలు తరచుగా జరగడం లేదు. ఇలాంటి సమయంలో తైవాన్ ఎంపీల బృందాన్ని భారత్ ఎందుకు ఆహ్వానించింది?’ అని గ్లోబల్ టైమ్స్ ప్రశ్నించింది. త్సాయి ఇంగ్‌వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక తైవాన్ బృందం భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారని పేర్కొంది. తైవాన్ అధ్యక్షురాలిగా నిరుడు ఎన్నికయిన త్సాయి ఇంగ్‌వెన్ చైనానుంచి తైవాన్‌కు విముక్తి లభించాలని గట్టిగా కోరుకుంటున్న వారిలో ఒకరు. భారత్.. చైనాతో బేరసారాలు ఆడటానికి తైవాన్, దక్షిణ చైనా సముద్రం, దలైలామా అంశాలను లేవనెత్తాలని చాలాకాలంగా కోరుకుంటోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ముఖ్యంగా 46 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సిపిఇసి)ను దృష్టిలో పెట్టుకొని భారత్ తైవాన్ కార్డుతో ఆడుకోవాలని భావిస్తుండొచ్చని పేర్కొంది.