అంతర్జాతీయం

పాక్‌లో ఐసిస్ ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, ఫిబ్రవరి 16: పాకిస్తాన్‌లోని ఓ సూఫీ మసీదు రక్తసిక్తమైంది. కారు బాంబర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో వందమందికి పైగా మరణించారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీకి 200 కి.మీ దూరంలో సెహ్వాన్‌లో గల సూఫీ లాల్ షాబాజ్ ఖళందర్ మసీదులో ఈ ఘాతుకం జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ మసీదు గోల్డెన్ గేట్ ద్వారా ఆత్మాహుతి బాంబర్ లోపలికి ప్రవేశించాడు. సూఫీ నృత్యంగా పేర్కొనే దమాల్ జరుగుతున్న సమయంలో విస్ఫోటనం జరిగింది. మహిళలు, పిల్లలతో కూడిన ఆ ప్రాంతంలో అలజడి రేపేందుకు మొదట గ్రనేడ్ విసిరాడు. జనం భయంతో పరుగులు పెట్టడంతో వారిమధ్యే ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకున్నాడు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, పిల్లలేనని సెహ్వాన్ పోలీస్ అధికారి రసూల్ బక్ష్ తెలిపారు. ప్రతి గురువారం ఈ సూఫీ మసీదులో దమాల్ కార్యక్రమం జరుగుతుందని, దానికి పెద్దఎత్తున భక్తులు హాజరవుతారని తెలిపారు. ఇది అత్యంత విశాలమైన మసీదు కావడం వల్ల వందల సంఖ్యలోనే ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యారని పేర్కొన్నారు. 60కిపైగా మృతదేహాలను వివిధ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు యుద్ధప్రాతిపదికన చికిత్స మొదలుపెట్టారు. అత్యవసర ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు అంబులెన్స్‌లను, ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతానికి తరలించారు. మృతులను తరలించేందుకు సాయపడాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరామని సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ తెలిపారు. ఈ మసీదు అత్యంత మారుమూల ప్రాంతంలో వుండటంవల్ల మృతులను ఆస్పత్రులకు తరలించడానికి క్షతగాత్రులకు చికిత్స చేయడానికి హెలికాప్టర్ల సాయం అవసరమన్నారు. ఈ భయానక దాడిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. పాకిస్తాన్ ప్రజలందరూ ఒకటిగా నిలిచి ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాలన్నారు.

చిత్రం..పేలుడు జరిగిన మసీదు వద్ద గుమికూడిన పాక్ పౌరులు