అంతర్జాతీయం

తగ్గేది లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 17: అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల వలసల నిరోధం విషయంలో రాజీలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించాడు. తొలి ఉత్తర్వు వివాదాస్పదం కావడంతో.. మరో కార్యనిర్వాహక ఉత్తర్వుకు పదునుపెడుతున్నామన్నారు. వచ్చేవారమే దీన్ని జారీ చేయడం ఖాయమని వెల్లడించారు. ‘అమెరికాకు వలసల నిషేధంపై కొత్తగా రూపొందించనున్న ఉత్తర్వులను లోతుగా, గట్టిగా అధ్యయనం చేస్తున్నాం. చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఉత్తర్వు ఉండటం ఖాయం’ అని వైట్‌హౌస్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాలపై ‘ప్రయాణ నిషేధ’ ఉత్తర్వులను జారీ చేస్తూ ఇంతకుముందు ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు న్యాయ విభాగం నుంచి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ అంశానే్న ప్రస్తావిస్తూ ‘తాజా ఉత్తర్వు ఎలా ఉండాలన్న అంశంపై దేశంలోని నిపుణులైన న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. కోర్టు ఏ అభ్యంతరాలనైతే వ్యక్తం చేసిందో వాటిని అధిగమించే విధంగానే తాజా ఉత్తర్వు ఉండబోతోంది’ అని నొక్కి చెప్పారు. అయితే, ఆ ఉత్తర్వుకు సంబంధించిన ఎలాంటి వివరాలూ ట్రంప్ వెల్లడించలేదు. ఏడు ముస్లిం దేశాలైన ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, సిరియా, ఇరాక్, యెమెన్‌లపై ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ 9వ అప్పీళ్ల కోర్టు కొట్టివేయడంపై అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వలసల నిషేధంపై కోర్టు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ‘అమెరికా రక్షణకు సంబంధించి 9వ అప్పీళ్ల కోర్టు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సహేతుకం కాదు. అదొక చెడ్డ నిర్ణయం’ అని వ్యాఖ్యానించారు. తాజా ఉత్తర్వు ప్రకారం వలస వచ్చేవాళ్లను, శరణార్థులను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని, విస్తృతమైన తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ‘ఇవన్నీ అమెరికా రక్షణకు తీసుకుంటున్న చర్యలే. కొత్త ఉత్తర్వు ఆమోదం పొందడానికి అందరి సహకారం అవసరం’ అని కోరారు. ‘మా ఉద్దేశం విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. అదే సమయంలో విస్తృతమైన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుతో అంతిమంగా అమెరికా, అమెరికన్ల రక్షణ సాధ్యమని ఆశిస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.