అంతర్జాతీయం

హఫీజ్ సరుూద్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఫిబ్రవరి 21: జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సరుూద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సరుూద్, అతడి అనుచరులకు చెందిన సంస్థల ఆయుధ లైసెన్సులను పంజాబ్ ప్రభుత్వం రద్దుచేసింది. జమాత్ ఉద్ దవా సంస్థను కట్టడి చేయడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు పంజాబ్ హోమ్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. జమాత్ ఉద్ దవా (జెయుడి), ఫలా ఇ ఇన్సానియెత్ (ఎఫ్‌ఐఎఫ్) సంస్థలపై ఆంక్షలు విధించినట్టు తెలిపింది. ‘44 ఆయుధాలకు సంబంధించి లైసెన్సులు పంజాబ్ హోమ్‌శాఖ రద్దుచేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకుంది’ అని అధికార ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 30న సరుూద్, మరో నలుగురు ఉగ్రవాదులను లాహోర్‌లో గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. 90 రోజుల పాటు వారిని నిర్బంధంలోనే ఉంచుతారు. జెయుడి, ఎఫ్‌ఐఎఫ్ సంస్థలకు చెందిన 37 మంది సభ్యులను దేశం విడిచివెళ్లకుండా ఆంక్షలు విధించింది. హఫీజ్ సరుూద్, అతడి అనుచరులు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఈ చర్యలు తీసుకున్నారు. ఆ రెండు ఉగ్రవాద సంస్థలపైనా ఐరాస భద్రతా మండలిలో తీర్మానాలు చేసి ఉన్నారు. ‘హఫీజ్ సరుూద్, అబ్దుల్లా ఉబైద్, జాఫర్ ఇక్బల్, అబ్దుల్ రెహ్మాన్, అబిద్, కషీఫ్ నైజీలు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు’ అని పంజాబ్ హోమ్ శాఖ వెల్లడించింది. జెయుడి, ఎఫ్‌ఐఎఫ్‌లపై ఆరునెలలపాటు నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.