అంతర్జాతీయం

షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 21: ఇంజన్ వైఫల్యం కారణంగా మెల్బోర్న్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి తేలికపాటి విమానం దూసుకువచ్చి బీభత్సం సృష్టించింది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అమెరికన్లు, ఒక ఆస్ట్రేలియా పైలట్ మరణించారు. తాస్మానియా దీవికి వెళుతున్న ఈ విమానం అతితక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలోనే ఇంజన్ విఫలమైందని, దాంతో అది నేరుగా ఎసెండాన్ నగరంలోని డైరెక్ట్ ఫ్యాక్టరీ ఔట్‌లెట్ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి దూసుకువచ్చేసిందని అధికారులు తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో ఈ రకమైన సంఘటన ఎప్పుడూ ఆస్ట్రేలియా జరగలేదని వెల్లడించారు.

చిత్రం..విమానం కూలిన ప్రాంతంలో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది