అంతర్జాతీయం

అదిగదిగో సప్తలోకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: రోదసిలో జీవం అనే్వషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న పరిశోధనలో సరికొత్త ఆవిష్కరణ జరిగింది. భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడిని పోలిన ఒక నక్షత్రం చుట్టూ భూ పరిమాణం కలిగిన ఏడు గ్రహాలు తిరుగుతున్నాయని నాసా శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ఈ ఏడు గ్రహాలకూ మన భూమికి ఉన్నట్లే చంద్రుళ్లు, కక్ష్యలు ఉన్నాయని నాసాకు చెందిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ దీన్ని కనుగొందని వారు వెల్లడించారు. ఈ గ్రహాల్లో నీరు ఉండే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని, ఇందులో ఏలియన్ జీవం ఉండవచ్చని పేర్కొన్నారు. వీటిలో మూడు గ్రహాల్లో కచ్చితంగా నివాస యోగ్యత ఉందని ధీమాగా చెప్తున్నారు. మన భూమికి సూర్యుడి మాదిరిగానే ఈ గ్రహాలకు కూడా ట్రాప్సిట్-1 అన్న నక్షత్రం ఉంది. దీని చుట్టూనే ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. వీటి కక్ష్యలు ఈ ట్రాప్సిట్-1కు చాలా దగ్గరగా ఉన్నాయని శాస్తవ్రేత్తలు తెలిపారు. గ్రహాలు కూడా ఒకదానికి ఒకటి దగ్గరగానే ఉన్నాయని వారు వివరించారు. ‘‘ ఎవరైనా ఒక వ్యక్తి ఇందులో ఏ ఒక్క గ్రహం ఉపరితలంపై నిలుచుని చూస్తే పొరుగున ఉన్న మరో గ్రహానికి సంబంధించిన మేఘ మాలికలను, భౌగోళిక అంశాలను సమీపం నుంచి చూడవచ్చు.’’ అని నాసా పేర్కొంది. అయితే ఈ ఏడు గ్రహాలు కూడా మన భూమి మాదిరిగా తమ చుట్టూ తాము భ్రమించటం లేదు. ఎప్పుడూ ఒక వైపు మాత్రమే కనిపించేలా తమ సూర్యుడి చుట్టూ (ట్రాప్సిట్-1) తిరుగుతున్నాయి. అంటే మన భూమి మాదిరిగా వాతావరణ మార్పులు, రాత్రి పగళ్లు ఉండే అవకాశాలు తక్కువ. స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ గత పధ్నాలుగేళ్లలో కనుగొన్న అన్నింటిలోనూ తాజా ఆవిష్కరణ ఉత్కంఠగా ఉందని నాసా మేనేజర్ సీన్ కారీ అన్నారు.