అంతర్జాతీయం

భారత్‌తో చర్చలు సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 23: భారత్‌తో జరిగిన వ్యూహాత్మక చర్చలు ద్వైపాక్షిక సంబంధాలపై చెప్పుకోదగ్గ సానుకూల ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని, ఈ చర్చల్లో అనేక అంశాలపై విస్తృతస్థాయిలో అంగీకరాలు కుదిరాయని చైనా పేర్కొంది. అయితే అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వంకోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చూడడానికి మన దేశం చేస్తున్న ప్రయత్నాలపై ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న విభేదాల గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ‘ఊహించినట్లుగానే ఈ చర్చలు అనుకున్న లక్ష్యాన్ని చేరాయి. ద్వైపాక్షిక సంబంధాలపై చెప్పుకోదగ్గ సానుకూల ప్రభావాన్ని చూపించాయి’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ చైనా అధికారులతో జరిపిన చర్చలను గురువారం మీడియా సమావేశంలో విశే్లషిస్తూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. మొత్తం చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయనేది తమ అభిప్రాయమని, ఇరుపక్షాలు కూడా లోతుగా సమగ్రంగా తమ అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాయని, అనేక అంశాలపై విస్తృతస్థాయి అంగీకారానికి వచ్చాయని ఆయన చెప్పారు. ఇరుపక్షాలు కూడా అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ, విదేశీ విధానాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చలు జరిపారని ఆయన చెప్పారు. అయితే ఎన్‌ఎస్‌జిలోకి భారత్‌ను చేర్చుకోవడాన్ని, అలాగే మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చూడడానికి మన దేశం చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకోవడంపై మాత్రం గెంగ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.