అంతర్జాతీయం

ట్రాన్స్‌జెండర్లకూ సమాన అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకోసం గత అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జారీ చేసిన నిబంధనలను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులు వారికి మాత్రమే కేటాయించిన లాకర్ రూమ్‌లు, బాత్‌రూమ్‌లను ఉపయోగించుకోవాలని గతంలో ఒబామా ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను ట్రంప్ రద్దు చేస్తూ, ఇకపై వీరికి కూడా ఇతర విద్యార్థుల మాదిరిగానే సమాన అవకాశాలు కల్పించాలని అన్ని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. ఒబామా ప్రభుత్వ హయాంలో జారీ చేసిన గైడ్‌లైన్స్‌పై న్యాయస్థానాల్లో పలు కేసులు నమోదు కావడం, అలాగే న్యాయపరమైన లోపాలు కూడా ఉన్న కారణంగా వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని ట్రంప్ ప్రభుత్వం తెలియజేసింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాఠశాలల్లో, సమాజాల్లో, కుటుంబాల్లో ఇప్పటివరకు ఉన్న ఆందోళనలకు తెరపడుతుందని, విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అమెరికా విద్యాశాఖ మంత్రి బెట్సీ డెవోస్ అన్నారు.