అంతర్జాతీయం

లాహోర్‌లో పేలుడు..10 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఫిబ్రవరి 23: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గురువారం శక్తివంతమైన బాంబు పేలుడులో కనీసం 10 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. ఒక భారతీయ రెస్టారెంట్‌తో పాటుగా రెండు రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. డిఫెన్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన జడ్‌బ్లాక్ మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడులో 10 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడినట్లు పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి ఖావాజా సల్మాన్ రఫీక్ విలేఖరులకు చెప్పారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబే చౌపాటి, అల్‌ఫర్నో కేఫ్ రెస్టారెంట్లు మిలిటెంట్ల టార్గెట్‌గా కనిపిస్తోందని, బాంబే చౌపాటి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో బాంబును అమర్చారని లాహోర్ పోలీసు డిఐజి డాక్టర్ హైదర్ అషఫ్ చెప్పారు. ఈ పేలుడులో అనేక వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పోలీసులతోపాటుగా ఆర్మీ, రేంజర్స్ పారామిలటరీ జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకున్నారు. డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ ఏరియా సైన్యం కంట్రోల్‌లో ఉంది. ఈ పేలుడు జరిగిన వెంటనే ఈ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను మూసేశారు. అంతేకాదు, లాహోర్‌లోని అన్ని ప్రధాన వాణిజ్య కేంద్రాలు, మార్కెట్లు కూడా మూతపడ్డాయి.కాగా, లాహోర్‌లో ఈ నెలలో జరిగిన రెండో భారీ పేలుడు ఇది. కొద్దిరోజుల క్రితమే లాహోర్‌లోని మాల్‌రోడ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పోలీసు అధికారులతోపాటుగా 15 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు అప్గానిస్థాన్‌లో శిక్షణ పొందిన తర్వాత పాకిస్తాన్‌లోకి వస్తున్నారని పంజాబ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రాణా సనావుల్లా ఆరోపించారు. లాహోర్‌లో జరగనున్న పాకిస్తాన్ సూపర్‌లీగ్ ఫైనల్ జరక్కుండా చూడడమే ఈ దాడి లక్ష్యంగా కనిపిస్తోందని కూడా ఆయన అన్నారు.

చిత్రం..లాహోర్‌లో బాంబు పేలుడు జరిగిన స్థలంలో ధ్వంసమైన కార్లు