అంతర్జాతీయం

42 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరూట్, ఫిబ్రవరి 24: సిరియా పట్టణమైన అల్‌బాబ్ సమీపంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 42 మంది మరణించారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నుంచి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దారుణం జరిగింది. బాంబులతో నిండిన వాహనంతో వచ్చిన ఆత్మాహుతి బాంబర్ రెబెల్ కమాండ్ కేంద్రం వద్ద పేలిపోయాడు. ఈపేలుళ్ల తాకిడికి రెండు కమాండ్ పోస్టులు ధ్వంసమయ్యాయి. 42 మంది మరణించడంతోపాటు అనేక మంది గాయపడ్డారు. ఈదాడికి బాధ్యులెవరన్నది స్పష్టం కాకపోయినా దీని తీరు చూస్తే ఇది ఐసిస్ పనేనన్న విషయం స్పష్టమవుతోంది. ఐసిస్ నుంచి అల్‌బాబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు గత కొన్ని వారాలుగా ప్రభుత్వ దళాలు పోరాడుతున్నాయి. దాదాపుగా ఈ పట్టణం తమ ఆధీనంలోకి వచ్చేసిందన్న ఆనందం కూడా తీరకుండానే ఈ ఘాతుకం జరిగింది.