అంతర్జాతీయం

ట్రంప్ వ్యాఖ్యలు కారణం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే కాన్సాస్‌లో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యోదంతం జరిగిందన్న వాదనను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘ప్రాణహాని ఎవరికి జరిగినా విషాదకరమే. అయినప్పటికీ దీని లోతుల్లోకి నేను పోదల్చుకోలేదు. కానీ ఘటనకు, వలసలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధం ఉందనడం అసంబద్ధం. ఇంతకుమించి నేను చెప్పేదేమీ లేదు’ అని అమెరికా అధ్యక్ష భవనం (వైట్ హౌస్) ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియాతో అన్నారు. అమెరికా నావికాదళ మాజీ ఉద్యోగి ఆడమ్ పురిన్‌టన్ జాత్యహంకారంతో బుధవారం రాత్రి కాన్సాస్‌లోని బార్‌లో కాల్పులకు తెగబడి 32ఏళ్ల తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేయడంతోపాటు మరో భారతీయుడిని, అమెరికా యువకుడిని గాయపర్చిన ఘటన గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పైసర్ పైవిధంగా స్పందించారు. అయితే, ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. శ్రీనివాస్ హత్యపై త్వరిత గతిన దర్యాప్తు జరపాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తమకు అందించాలని విజ్ఞప్తి చేసినట్టు భారత రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ప్రతీక్ మాథుర్ తెలిపారు.